ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంను ఐచ్ఛిక సెలవు దినంగా (Optional Holiday) ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య:637 ద్వారా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈదుల్ ఫితర్(రంజాన్) పర్వదిన అనంతర రోజైన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరో వైపు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైన పండుగ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 2- హోలీ, ఏప్రిల్ 6- శ్రీరామనవమి, జులై 6- తొలి ఏకాదశి, జులై 10- గురుపూర్ణిమ, జులై 25- శ్రావణమాసం ప్రారంభం అవుతుంది.
ఆగస్టు 8- వరలక్ష్మీ వ్రతం, ఆగష్టు 9- రాఖీ పూర్ణిమ, ఆగష్టు 16- శ్రీకృష్ణాష్టమి, ఆగష్టు 27 – వినాయక చవితి, అక్టోబర్ 2- విజయదశమి, అక్టోబర్ -20 దీపావళి, అక్టోబర్ 22- కార్తికమాసం ప్రారంభం, జనవరి 14 – భోగి, జనవరి 15 – సంక్రాంతి, జనవరి 16 – కనుమ. జనవరి 23- వసంత పంచమి, జనవరి 30- మేడారం జాతర, ఫిబ్రవరి 15- మహాశివరాత్రి పండుగలు రానున్నాయి.