Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్UNICEF team met Jagan: సీఎంతో యూనిసెఫ్ బృందం

UNICEF team met Jagan: సీఎంతో యూనిసెఫ్ బృందం

వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న బృందం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) Dr. Zelalem B. Taffesse గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలోని వివిధ స్ధాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన యూనిసెఫ్‌ చీఫ్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీలు), ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్‌వాడీ వర్కర్స్, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ వంటి వివిధ స్ధాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు ముందుకొచ్చిన యూనిసెఫ్‌ వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూనిసెఫ్‌ బృందంతో చర్చించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, సుస్ధిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ముందుకెళుతున్న తీరును వివరించిన సీఎం, అభినందించిన యూనిసెఫ్‌ చీఫ్‌ చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామన్న యూనిసెఫ్‌ టీమ్‌ ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు యూనిసెఫ్‌ ప్రతినిధులకు తెలిపిన సీఎం, చైల్డ్‌ మ్యారేజ్‌ ఫ్రీ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దినట్లు వెల్లడి ఈ సమావేశంలో పాల్గొన్న యూనిసెఫ్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.పి. శ్రీధర్, యూనిసెఫ్‌ సోషల్‌ బిహేవియర్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌ సీమ, సీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ జానకి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News