Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Veligonda Project tunnel launched: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట టన్నెళ్లు ప్రారంభించిన...

Veligonda Project tunnel launched: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట టన్నెళ్లు ప్రారంభించిన సీఎం జగన్

ఎగువ చెర్లోపల్లి వద్ద ..

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట టన్నెళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. పూర్తి అయిన టన్నెల్‌ పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:

దశాబ్దాల కల నెరవేరిన పరిస్థితులు…
“ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య.. ఆ టన్నెల్‌లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను.
ప్రకాశం, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు.

ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే… ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను కూడా ఒక్కో టన్నెల్‌ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ టన్నెళ్లను పూర్తి చేయడం.. ఆయన (దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి) కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంది.

ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వ హయాంలో మనమే పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం.

30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.
ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయి.
దీంతో వచ్చే ఖరీఫ్‌లో, జూలై–ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం, ఈ జూలై–ఆగస్టులోనే జరగబోతోందని సంతోషంగా తెలియజేస్తున్నాను.

దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్‌ పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల కేరీయింగ్‌ కెపాసిటీతో రెండో టన్నెల్‌ పూర్తయింది. అంటే శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈరోజుతో పూర్తయిపోయింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్‌ఏ, ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి… ఈ జూలై–ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో రూ.1200 కోట్లు ఖర్చు చేసి ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి చేస్తాం.
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం.. ఈ రెండు టన్నెళ్లు పూర్తయ్యాయి. మిగిలినవన్నీ పెద్ద ఏమీ లేవు. రిజర్వాయర్‌ కూడా పూర్తయిపోయింది. నీళ్లు నింపడం కోసం రూ.1200 కోట్లు ఎల్‌ఏ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది.

నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్లీ మనం అధికారంలోకి వచ్చి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్‌ఏ ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతాం.

ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో గతంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి.
రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, రెండు టన్నెళ్లు దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల పొడవు అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. దివంగత నేత, రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులుతో పనులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి.

2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కిలోమీటర్ల టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం” అంటూ జగన్ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News