Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayanagaram: 50,000 మంది..10 km. మానవ హారంతో మహిళా దినోత్సవ సంబరాలు

Vijayanagaram: 50,000 మంది..10 km. మానవ హారంతో మహిళా దినోత్సవ సంబరాలు

విజయనగరం మొత్తం మానవహారంగా ఏర్పడి మహిళా దినోత్సవాలు ఘనంగా జరిపారు. 50,000 మంది విద్యార్థులు, మహిళా సంఘాల మహిళలు, సచివాలయ మహిళా ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనంపై నుంచి ర్యాలీగా సాగి, గౌరవ వందనం స్వీకరించారు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జిల్లా ఎస్పీ దీపికా ఎం. పాటిల్. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం వరకు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీ, మానవహారం అందరినీ ఆశ్చరిచింది.
దారి పొడువునా నినాదాలు ఇస్తూ.. అతిథులకు స్వాగతం పలికారు విద్యార్థులు, మహిళలు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్య పరచడం, తక్కువ వయసులో వివాహాలు జరగడం వల్ల కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి మానవహారం నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి వెల్లడించారు. మహిళల్లో ధైర్యం కల్పించి వారికి విద్య ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో చైతన్య పరచడం ఈ మహిళా దినోత్సవ వేడుకల ముఖ్య ఉద్దేశ్యమని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News