Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: శ‌క‌టాలు తిల‌కించేందుకూ ప్ర‌త్యేకంగా వీలు క‌ల్పించిన ప్ర‌భుత్వం

Vijayawada: శ‌క‌టాలు తిల‌కించేందుకూ ప్ర‌త్యేకంగా వీలు క‌ల్పించిన ప్ర‌భుత్వం

స్వ‌ర్ణాంధ్ర స్ఫూర్తి ప‌థంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శ‌క‌టాలు

76వ భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు సంద‌ర్భంగా ఆదివారం విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో జ‌రిగిన వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో రూపుదిద్దుకున్న అలంకృత శ‌క‌టాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

- Advertisement -

ఆకట్టుకున్న శకటాలు

స్వ‌ర్ణాంధ్ర @ 2047 ప‌ది సూత్రాల ప్ర‌గ‌తి సోపానాల విజ‌న్ డాక్యుమెంట్ స్ఫూర్తిగా తీసుకొని వివిధ శాఖ‌లు రూపొందించిన శ‌క‌టాలు ఆక‌ట్టుకున్నాయి. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి భ‌విష్య‌త్తు దార్శ‌నిక‌త‌పై ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధి, నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌తిబింబించేలా రూపొందిన శ‌క‌టాల‌ను న‌గ‌ర ప్ర‌జ‌లు తిల‌కించేందుకు వీలుగా వేడుక‌ల అనంత‌రం ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానం నుంచి బెంజ్ స‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు రింగ్‌, గుణ‌ద‌ల‌, ఏలూరు రోడ్డు, కంట్రోల్ రూమ్‌, బంద‌ర్ రోడ్డు త‌దిత‌ర ప్రాంతాల మీదుగా శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించిన 18 శ‌క‌టాలు:

  1. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు ప్రణాళికా శాఖలు: పేద‌రికం లేని సమాజమే మన ప్రభుత్వం ఆశయం.
  2. గృహ నిర్మాణ శాఖ: 2029 నాటికి అర్హులకు పక్కా ఇళ్లు & ఇంటి నివాస స్థలాలు.
  3. పరిశ్రమలు: యాంప్లిఫైయింగ్ ఆంధ్రప్రదేశ్… న్యూ ఇంపెటస్… న్యూ ఎరా.
  4. పర్యాటక శాఖ: పర్యాటక వారసత్వం మరియు సంస్కృతి.
  5. సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖ: విద్యా వికసిత ఆంధ్ర.
  6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: స్కిల్లింగ్ ఆంధ్రా.
  7. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: కేన్స‌ర్‌పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం.
  8. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం: కిశోరి వికాసం బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్.
  9. జలవనరుల శాఖ: తెలుగు తల్లికి జల హారతి.
  10. అటవీ శాఖ: నగర వనం… ఎకోటూరిజం.
  11. రైతు సాధికార సంస్థ: వ్యవసాయ శాఖ… ప్రకృతి వ్యవసాయం.
  12. మత్స్య శాఖ: మౌలిక వసతుల కల్పనతో ఆక్వాకల్చర్ లో అధిక ఉత్పత్తులు.
  13. ఏపీ సీఆర్‌డీఏ: .మన అమరావతి…. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం
  14. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి: పల్లె పండగ – పంచాయతీ వారోత్సవాలు.
  15. ఇంధన శాఖ: పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యం.
  16. ఉద్యానవన శాఖ: డీప్ టెక్నాలజీస్ అనుసంధానంతో ఉద్యానవన ఆంధ్రప్రదేశ్.
  17. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్: పర్యావరణ రక్షిత స్వచ్ఛాంద్రప్రదేశ్.

18. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ: సాంకేతికతో పాలనలో విప్లవాత్మక అడుగులు.

    తొలి మూడు స్థానాల్లో నిలిచిన శ‌క‌టాలు:

    1. నైపుణ్యం-మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి (డిపార్టుమెంట్లు: హెచ్ఆర్‌డీ/నైపుణ్యాభివృద్ధి; ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం; మ‌హిళా, శిశు సంక్షేమం).
    2. నాణ్య‌మైన ఉత్ప‌త్తులు, బ్రాండింగ్ (డిపార్ట్‌మెంట్‌: ఉద్యాన‌)
    3. గ్లోబ‌ల్ – బెస్ట్ లాజిస్టిక్స్ (డిపార్ట్‌మెంట్లు: సీఆర్‌డీఏ/పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి; పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి)
    సంబంధిత వార్తలు | RELATED ARTICLES
    spot_img

    Latest News