సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత మాజీ మంత్రి గుమ్మనూర్ జయరాంకు లేదని ఆలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి అన్నారు. స్థానిక అర్ అండ్ బీ అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని ఆయన తెలిపారు. గుమ్మనూర్ జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి జయరాంకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని ఆయన తెలిపారు.
ఎంపీ టికెట్ వద్దని..
బీసీలను గౌరవించి సీఎం జగన్ మోహన్ రెడ్డి జయరాంకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. అయితే జయరాం ఎంపీ టికెట్ వద్దని చెప్పి టీడీపీ లో చేరి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని ఆయన తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హాయంలోనే ఎస్సీ, బీసీలకు న్యాయం జరిగిందని ఆయన తెలిపారు.
మంత్రిగా దోచుకున్నాడంతే..
ఐదేళ్ల పాటు మంత్రిగా ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకో లేదని ఆయన ఆరోపించారు. మంత్రి పదవిలో ఉండి దోచుకుని దాచుకున్నావు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. రాజకీయ బిక్ష పెట్టిన తల్లి లాంటి వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ గుమ్మనూర్ జయరాంపై విరుపాక్షి ఆగ్రహం వ్యక్తంచేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలిపారు. జయరాం గుంతకల్లులోనే కాదు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. మరోసారి మా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని జయరాంను విరూపాక్షి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనంకి జనార్దన్ నాయుడు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యుడు దొర బాబు, చిప్పగిరి ఎంపీపీ మారయ్య, నిట్రవట్టి మాజీ ఎంపీటీసీ తిమ్మప్ప, హాలహర్వి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామిరెడ్డి, ఆలూరు కన్వీనర్ చిన్న ఈరన్న, సీపీ నాయకులు తిప్పరెడ్ఖి, రామాంజనేయులు, వీరేష్ పాల్గొన్నారు.