Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: జీతాలు ఎందుకు లేట్ అంటే.. సజ్జల చెప్పిన మాటకి అంతా షాక్!

AP Govt: జీతాలు ఎందుకు లేట్ అంటే.. సజ్జల చెప్పిన మాటకి అంతా షాక్!

- Advertisement -

AP Govt: ఏపీలో ఇప్పుడు ప్రభుత్వానికి గడ్డుకాలమే నడుస్తుంది. రాజకీయంగా వైసీపీ స్ట్రాంగ్ గానే ఉన్నా.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆర్ధిక బాధలతో కొట్టుమిట్టాడుతోంది. డిసెంబర్ నెల దాదాపుగా సగం పూర్తయింది. కానీ, ఇప్పటివరకు ఏపీ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఎప్పుడు ఉద్యోగుల అకౌంట్‌లో పడతాయో కూడా తెలియని పరిస్థితి. ఉద్యోగులు తమ ఫోన్ లో ఏ మెసేజ్ వచ్చినా అది జీతం మెసేజినేమో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులంటే కరెక్టుగా ఒకటో తేదీ బ్యాంకు ఖాతాలో జీతం జమవుతుంది. కానీ.. ఇప్పుడు ఏపీలో నెలలో ఏరోజైనా పడొచ్చు. ఎప్పుడు పడుతుందో ఏ బ్యాంకు అధికారి.. ఏ శాఖ అధికారి అయినా చెప్పలేరు. మొన్నటి వరకు పే స్కేల్ ఆధారం.. ముందుగా తక్కువ స్థాయి జీతాలను చెల్లించి భారీ జీతాలను చివరిలో చెల్లించేవారు. కానీ.. ఈనెల మరీ దారుణంగా రెండో వారంలో కూడా చిన్న జీతాల వాళ్ళకి కూడా చెల్లించలేదు.

ఇదే విషయాన్ని జగన్ ప్రభుత్వంలో సకల శాఖా మంత్రిగా చెలామణి అవుతున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం విని అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి షాక్ కొట్టినంత పనైంది. జీతాలు ఈ నెల కూడా ఆలస్యమే కదా సార్ అని ఓ మీడియా ప్రతినిధి అడిగితే.. అందరికీ ఒకేసారి జీతాలు ఇవ్వాలని తామే ఆలస్యం చేశామని చెప్పేశారు.

అంటే, సజ్జల చెప్పింది ఏంటంటే.. ఇంతకు ముందు ప్రభుత్వాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ శాలరీలు పడితే.. క్రాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మొదటి వారంలో ఇచ్చేవాళ్ళు. కానీ.. తమ దృష్టిలో అందరు ఉద్యోగులు ఒకటే కనుక అందరికీ కలిపి ఒకేసారి ఇవ్వాలని ఆపామని చెప్పారన్నమాట. అయితే.. సజ్జల చెప్పినట్లు అందరికీ ఒకేసారి అయినా.. ఇప్పటికే రెండో వారం కూడా పూర్తయింది. అదీకాక ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద అంత ప్రేమ ఉంటే అందరికీ ఒకేసారి ఒకటో తేదీనే జీతాలు ఇవ్వొచ్చు కదా. పాపం.. తామేమి చెప్పినా వినేందుకు జనాలు ఉన్నార్లే అనుకుంటున్నారేమో!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News