Thursday, October 31, 2024
Homeఆంధ్రప్రదేశ్Why not 175 YCP slogan: వై నాట్ 175, ఇదే వైసీపీ నినాదం

Why not 175 YCP slogan: వై నాట్ 175, ఇదే వైసీపీ నినాదం

వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల్లో పోరాడనున్నట్టు వైసీపీ వెల్లడించింది. ఇప్పటికే సిద్ధం పేరుతో రాజకీయ సభలను నిర్వహిస్తున్న జగన్ 175 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఎంఎల్ఏ, ఎంపీ టికెట్లు పొందిన అభ్యర్థుల పేర్లను ఇడుపులపాయలో వెల్లడించింది వైసీపీ. ఈమేరకు సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. ధర్మాన ప్రసాదరావు పేర్లను చదివి వినిపించారు. గత ఎన్నికల్లోనూ ధర్మాన చేతనే అభ్యర్థుల పేర్లను వెల్లడించగా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు జగన్.

- Advertisement -

పలు సర్వేలు సామాజిక సమీకరణాల ఆధారంగానే ఈ 175 మంది పేర్లను ఎంపిక చేసినట్టు వైఎస్ జగన్ వెల్లడించారు. సగం సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించామని, మరికొన్ని మహిళా అభ్యర్థులకు కేటాయించగా వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత పెంచనున్నట్టు అప్పుడే తనకు తృప్తి లభిస్తుందని జగన్ వివరించటం విశేషం.

25 మంది వైసీపీ ఎంపీ అభ్యర్థులు, 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ విజయం సాధించటం ఖాయమంటూ ఈ సందర్భంగా జగన్ ధీమా వ్యక్తంచేశారు. 81 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News