Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Yaganti: యాగంటిలో వైభవంగా పంచాక్షరి జప యజ్ఞ మహోత్సవం

Yaganti: యాగంటిలో వైభవంగా పంచాక్షరి జప యజ్ఞ మహోత్సవం

యాగంటిలో వైభవంగా పంచాక్షరి జప యజ్ఞ మహోత్సవం సాగింది.. ఈ మహోత్సవంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని, పూజలు చేశారు. బనగానపల్లె మండలంలోని ఎర్రమల కొండల్లో స్వయంభూగా వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో యాగంటి తీర్థయాత్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాణి రుద్రయాగ సహిత ప్రయుత పంచాక్షరి జపయజ్ఞ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ జపయజ్ఞ మహోత్సవంలో పాణ్యం ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్, యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం నిత్యాన్నదాన సంస్థ వ్యవస్థాపకులు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News