Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: ఈవీఎంల పనితీరుపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఈవీఎంల పనితీరుపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

YS Jagan| ఎన్నికల్లో ఈవీఎంల(EVM) పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో భారత రాజ్యాంగానికి ఆమోదముద్ర పడి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

‘భారత రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలి. ప్రజల ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారు’ అని రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News