మహిళలను వ్యక్తిగతంగా కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి సునీతపై ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టించింది కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) అని పోలీసులు తెలిపారని గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
వైసీపీకి చెందిన ‘సోషల్ సైకో’ వర్రా రవీందర్‌రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని వెంటనే విచారించి అరెస్ట్ చేయాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు మాజీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి మూలకారణమని పేర్కొన్నారు. అవినాష్‌తో పాటు భార్గవరెడ్డిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని షర్మిల తెలిపారు.
కాగా అంతకుముందు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం ఆయన సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించారు.