Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: వైసీపీ 'ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ'.. జగన్ విమర్శలకు షర్మిల కౌంటర్

YS Sharmila: వైసీపీ ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’.. జగన్ విమర్శలకు షర్మిల కౌంటర్

YS Sharmila| వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan)పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తక్కువ ఓటు శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం అనవసరం అంటూ జగన్ విమర్శలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

“ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది జగన్ మోహన్ రెడ్డి తీరు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారికి 38 శాతం ఓట్లు వచ్చినా.. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకూ మాకూ తేడా లేదు’’ అని ఎద్దేవా చేశారు.

“38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోకుండా వైసీపీ(YCP)ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’గా మార్చారని షర్మిల మండిపడ్డారు. ‘‘అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ‘ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ’. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు మాట్లాడడానికి కాదు. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి’’ అని పేర్కొన్నారు.

ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని వైసీపీకి ఆమె సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ అన్నది తేలుతుంది కదా. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి” అని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News