Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్YSR Jayanthi: వైఎస్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జగన్

YSR Jayanthi: వైఎస్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జగన్

ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద..

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమం

- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News