చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైయస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద జిల్లా వ్యాప్తంగా 857 మంది చేనేతలకు రూ.2.05 కోట్ల జమ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటినరీ హాల్ లో తిరుపతి వెంకటగిరి సభా స్థలం నుంచి 5వ విడత వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మునిసిపల్ వైస్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల సంఘం డైరెక్టర్ సునీత అమృత్ రాజ్ తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సామూన్ మాట్లాడుతూ 2023 – 24 సంవత్సరానికి ఐదో విడతగా వైయస్సార్ నేతన్న నేస్తం పధకం కింద జిల్లా వ్యాప్తంగా 857 మంది చేనేతలకు రూ.2.05 కోట్ల జమ చేశామన్నారు. అర్హులైన చేనేతలకు ఒక్కొక్కరికి రూ.24 వేలు జమ చేశామన్నారు.
మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందిన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో వైయస్సార్ నేతన్న నేస్తం పధకం కింద ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 51 మంది చేనేత లబ్ధిదారులకు రు.12.24 లక్షలు, బనగానపల్లిలో 504 మందికి రు.120.96 లక్షలు, డోన్ లో 223 మందికి రు.53.52 లక్షలు, నందికొట్కూర్ లో 14 మందికి రు.3.36 లక్షలు, నంద్యాలలో 37 మందికి రు.8.88 లక్షలు, పాణ్యంలో ఒకరికి రు.24 వేలు, శ్రీశైలంలో 27 మందికి రు.6.48 లక్షలు, వెరసి మొత్తం 857 మంది చేనేత లబ్ధిదారులకు రూ.205.68 లక్షల రూపాయలు నేరుగా జమ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మునిసిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల సంఘం డైరెక్టర్ సునీత అమృత్ రాజ్ తదితరులు చేనేత లబ్ధిదారులకు చెక్ ను అందచేశారు.