Mithun Reddy Arrest: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. విచారణకు పిలిచిన సిట్ అధికారులు వెంటనే నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం గెలిచాక.. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు కాగా.. పలువురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే ఈ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇతనితో పాటు ఈ స్కామ్‌లో ఎంతో మంది పెద్దపెద్ద నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ రూపకల్పనలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు కేసు విచారణలో తేలింది.
ఇదే విషయంపై ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఎంపీ ఆశ్రయించారు. ఆ పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేయడం వల్ల మిథున్ రెడ్డి విచారణకు హాజరవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు.
ఈ కేసులో లిక్కర్ స్కాంలో ఏ1 నిందితునిగా రాజ్ కసిరెడ్డి, ఏ2 గా వాసుదేవరెడ్డి, ఏ3 నిందితునిగా సత్యప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు వైసీపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఈ కేసులో ఏ5 ఉన్నారు.


