వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (84) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న పార్టీ శ్రేణులు, బంధువులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan), ఆయన తల్లి విజయమ్మ, ఏపీసీసీ చీఫ్ షర్మిల(Sharmila) మేదరమెట్ల రానున్నారు.
YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES