Sunday, November 16, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిJanasena MLA: దుర్గగుడి వద్ద జనసేన ఎమ్మెల్యేలకు అవమానం!

Janasena MLA: దుర్గగుడి వద్ద జనసేన ఎమ్మెల్యేలకు అవమానం!

Janasena MLA: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గ ఆలయాన్ని మంగళవారం ఉదయం దర్శించేందుకు జనసేన పార్టీకి చెందిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ వచ్చారు. అయితే ఆలయంలో పాలించాల్సిన ప్రోటోకాల్‌ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం, ఎమ్మెల్యే వాహనాన్ని కొండపై సమాచార కేంద్రం వరకు అనుమతించాలి. కానీ, ఓం టర్నింగ్ వద్దే సిబ్బంది వాహనాన్ని ఆపేసారు. అంతేకాకుండా, అమ్మవారి దర్శనానికి సంబంధించి కూడా ఆయనకు సరైన మార్గనిర్దేశం చేయకపోవడంతో ఎమ్మెల్యే తన అసంతృప్తిని ఆలయ ఈవోకు తెలియజేశారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేస్తానంటూ కూడా హెచ్చరించినట్లు సమాచారం.

- Advertisement -

ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో, ప్రోటోకాల్ విధుల్లో ఉన్న ఐదుగురు సిబ్బందిని తక్షణమే బాధ్యతల నుంచి తొలగించి, మెమోలు జారీ చేశారు. ఇదే దుర్గగుడిలో ప్రోటోకాల్ అంశాలపై గతంలోనూ పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. కొంతకాలం క్రితం ఓ మంత్రి వచ్చినప్పుడు కూడా ఆలయ సిబ్బంది స్పందించకపోవడంతో, ఈవోపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అటుపై ఇతర అధికారులు, సహాయక సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నా, పరిస్థితి గణనీయంగా మెరుగుపడకపోవడం ఆందోళనకరం.

ప్రస్తుతం వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు సరైన విధానం అమలులో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యులు, ప్రజాప్రతినిధులు ఆలయానికి వచ్చే విషయాన్ని ముందుగానే అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వీరి కోసం ప్రత్యేకమైన ప్రోటోకాల్ విభాగాన్ని ఏర్పాటు చేసి, వాహనాల వివరాలు, కాల్స్, మెసేజ్‌లు వంటి సమాచారాన్ని నమోదు చేసి, తగిన సమయానికి చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

అమరావతి రాజధానిగా ఉండటంతో, దుర్గగుడికి ప్రముఖుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆలయ అధికారులు తగినంత సిబ్బందిని మూడు షిఫ్టుల ప్రాతిపదికన అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా, ప్రోటోకాల్ రూల్స్ గురించి స్పష్టత లేకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా రాగానే హడావుడిగా స్పందించాల్సిన అవసరం లేకుండా, ముందు నుంచి తగిన సమాచారం సమర్పించడమూ, ఆలయ పరిపాలన బలమైనది కావడమూ కీలకం.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad