Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిTest Tube Baby: బెజవాడ టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో సంచలన విషయాలు

Test Tube Baby: బెజవాడ టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో సంచలన విషయాలు

Test Tube Baby case: సంతానం లేని దంపతులు ఎంతో ఆశతో ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న వేళ, కొన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల్లో చోటుచేసుకుంటున్న అనుచిత చర్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్ “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్” పై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ, భర్త వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని కోరగా, ఆ ఆసుపత్రిలో వారు అనుమతించని రీతిలో వేరే వ్యక్తి స్పెర్మ్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.

- Advertisement -

దంపతులు చికిత్స అనంతరం శిశువు డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, ఫలితాల్లో శిశువు జన్యు కణాలు భర్తవాటి‌తో పోలి రాకపోవడం గమనించారట. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి బెజవాడలోని అదే పేరుతో ఉన్న బ్రాంచ్‌కు సంబంధించి కీలక సమాచారం సేకరించారు.

దీంతో విజయవాడలో ఉన్న డాక్టర్‌ను గుర్తించి, ఆమెను హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం. గతంలోనూ ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నంలోనూ ఇటువంటి కేసులో డాక్టర్ అరెస్ట్‌కు గురయ్యారు. 2018లో ఈ ఆసుపత్రి లైసెన్సు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసినప్పటికీ, 2020లో మరో పేరుతో పునఃప్రారంభించారని పోలీసులు గుర్తించారు.

తాజా ఘటనపై ఆరా తీస్తున్న దర్యాప్తు బృందాలు, గతంలో ఈ సెంటర్‌లో ఐవీఎఫ్ విధానంలో జన్మించిన శిశువుల వివరాలు, తల్లిదండ్రులకు అందించిన సమాచారం సరైనదేనా అనే కోణంలో విచారణను ముమ్మరం చేశాయి. దీనితో టెస్ట్ ట్యూబ్ సెంటర్ల విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad