అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు ఓ ప్రబుద్దుడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి వివరాలను వెల్లడించారు.
పదో తరగతి చదువుతున్న బాలిక హెచ్ఐవీ నివారణ మందుల కోసం ప్రతి నెల రాయచోటి ప్రభుత్వాస్పత్రికి వెళ్తుండేది. అలా వచ్చిన సమయంలో ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. అయితే సదరు బాలికకు ఏడు నెలలు నిండాయి. ఈ విషయం అందరికి తెలిస్తే తన పని అయిపోతుందని తెలిసి.. చాకచక్యంగా ఆస్పత్రిలోని ఓ నర్సు సాయంతో అబార్షన్ చేయించాడని పోలీసులు తెలిపారు.
విషయం బాలిక కుటుంబానికి తెలియడంతో వారు ఆదివారం రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ సీఐ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. ఆ ల్యాబ్ టెక్నిషియన్ విజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.