విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును కొనసాగించలేకపోయే వారికి స్కాలర్‌షిప్‌లు ఆర్థిక సహాయం అందించి, వారి విద్యను ప్రోత్సహిస్తాయి. ఇది విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది. స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే ముఖ్యమైన సాధనం. ఈ ఆర్థిక సాయం విద్యార్థులను వారి చదువుపై దృష్టి పెట్టేలా చేస్తుంది, ఆర్థిక సమస్యలను అడ్డుకట్ట వేస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూ. 6,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని ఆరోపణలు ఉన్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
విద్యా శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను కళాశాలలకు నేరుగా చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈరోజు రూ.788 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అంతేకాకుండా మొత్తం ఫీజు బకాయిలను దశల వారికీ చెల్లించి విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.788 కోట్లు విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే మిగతా మొత్తం బకాయిలను కచ్చితంగా దశల వారిగా చెల్లిస్తుంది. ఇది విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించి సర్టిఫికేట్లు సులభంగా తీసుకునేందుకు సహాయపడుతుంది. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది, ఇది విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకున్న సత్వర చర్యలలో ఒకటి.