Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుTirumala: టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ కు క్షమాపణ చెప్పిన బోర్డు సభ్యుడు నరేష్

Tirumala: టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ కు క్షమాపణ చెప్పిన బోర్డు సభ్యుడు నరేష్

టీటీడీలో (TTD) ఉద్యోగ సంఘాల నిరసనకు తెర పడింది. టీటీడీ ఉద్యోగి(TTD Employee) బాలాజీ సింగ్ కు బోర్డు సభ్యుడు నరేష్( TTD Board member Naresh) క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఇది మా కుటుంబ సమస్య అందరూ కలసి చర్చించుకున్నామన్నారు. ఈ సమస్యను కలసికట్టుగా మాట్లాడుకుని పరిష్కరించుకున్నామని వెల్లడించారు. దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు.

- Advertisement -

నా డ్యూటీ అయిపోయిన సమయంలో బోర్డు సభ్యులు నరేష్ నన్ను దూషించారని టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గేటు తెరిచిన నన్ను దూషించడం చాలా బాధ వేసిందన్నారు. ఉద్యోగ సంఘాలు పాలకమండలి సభ్యులతో, అధికారులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇప్పుడు బోర్డు సభ్యుడు నరేష్ నన్ను క్షమాపణ కోరారని తెలిపారు.

బాలాజీ పట్ల తాను బాధ్యత రహితంగా వ్యవహరించానని నరేష్ కుమార్ పశ్చాత్తాప పడ్డారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియాకి తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పు ఆయన కుటుంబ సభ్యులు సైతం పశ్చాత్తాప పడ్డారన్నారు. సంస్థ ప్రతిష్ట కాపాడే విధంగా అందరూ కృషి చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad