Sunday, November 16, 2025
HomeAP జిల్లా వార్తలుNara Rammurthy Naidu: రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి

Nara Rammurthy Naidu: రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి

CM Chandrababu| నారా రామ్మూర్తి నాయుడి (Nara Rammurthy Naidu) పార్థివ దేహాన్ని వారి స్వగ్రామం నారావారి పల్లెకి తరలించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు సీఎం చంద్రబాబు (Chandrababu), నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌ (Nara Lokesh), బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారితో పాటు మహారాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌, సినీ నటుడు మోహన్‌బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు కూడా నివాళులు అర్పించారు.

- Advertisement -

కాగా మధ్యాహ్నం 3 గంటలకు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ అంతిమ సంస్కారాలు జరిగిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తండ్రి మృతిలో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుమారులు నారా రోహిత్, నారా గిరీష్‌లను చంద్రబాబు, లోకేష్ ఓదార్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad