Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుKodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

Kodali Nani| వైసీపీ(YCP) నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూటమి కార్యకర్తలు వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో వారు విచారణకు హాజరు కావడంతో పాటు అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానిపైనా కేసు నమోదైంది.

- Advertisement -

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్‌లను సోషల్ మీడియాలో తీవ్రంగా దుర్భాషలాడారని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ శనివారం రాత్రి విశాఖపట్టణం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ మహిళగా ఆ బూతులు భరించలేకపోయానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. త్వరలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad