Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుVizag Railway zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు

Vizag Railway zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు

విశాఖ వాసులకు భారీ శుభవార్త అందింది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వో జోన్ ప్రక్రియ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. వైజాగ్‌లో జోనల్ కార్యాలయం(Vizag Railway zone) నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. డిసెంబర్‌ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని నిర్దేశించింది.

- Advertisement -

9 అంతస్తులు, రెండు సెల్లార్‌ పార్కింగ్‌ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు టెండర్లను ఆహ్వానించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దీంతో జోన్‌ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad