Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుమలలో ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..!

తిరుమలలో ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవిలో భక్తులు భారీగా తరలివస్తుంటారు.. దీంతో టీటీడీ కొన్ని కీలక మార్పులు చేసింది. మే 1వ తేదీ నుంచి జూలై 15 వరకు దాదాపు రెండున్నర నెలల పాటు ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ కాలంలో సిఫారసు లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇకపై సిఫారసుల మేరకు ఎవరికీ దర్శనం లభించదు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తారు. తిరుమలలో రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో, సామాన్య భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

వేసవి సెలవులతో తిరుమలకు కుటుంబాలతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయం బయట నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్లు తిరుమలలో సాధారణంగా మారిపోయాయి. సర్వదర్శనం సమయాన్ని పొడిగించడం, బ్రేక్ దర్శనాల సమయాల్లో మార్పులు తీసుకురావడం వంటి చర్యలు భక్తుల కోసం అనివార్యంగా మారాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 5:45కు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు, 6:30కి రిఫరల్ వీఐపీ దర్శనాలు, 6:45కి జనరల్ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. అలాగే 10:15కి శ్రీవాణి ట్రస్ట్ దాతలు, 10:30కి ఇతర దాతలు, 11 గంటలకు టీటీడీ ఉద్యోగులకు బ్రేక్ దర్శనం కల్పిస్తారు.

అయితే గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవల నేపథ్యంలో ఆ రెండు రోజులలో బ్రేక్ దర్శనాలు పాత షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. వేసవి రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, భక్తులు ఈ మార్పులను గమనించి ముందుగానే తమ పయనాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది టీటీడీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad