Saturday, January 4, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిThirupathi: ఎస్వీయూలో అదనపు నిఘా కెమెరాలు

Thirupathi: ఎస్వీయూలో అదనపు నిఘా కెమెరాలు

శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో సమస్యగా మారిన చిరుత కదలికల గుర్తింపు కొరకు అనుమానస్పద ప్రాంతాలలో దాదాపు 10 ప్రత్యేక కెమెరాలను అమర్చినట్లు ఫారెస్ట్ అధికారులు డి.ఎఫ్.ఓ, ఎఫ్.ఆర్.ఓ లు తెలిపారు.

- Advertisement -

ఈ కెమెరాలు రాత్రి సమయం కూడా పనిచేస్తూ, కదలికలు వచ్చిన వెంటనే రికార్డ్ చేస్తాయని వారు తెలిపారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ అప్పారావు రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు అభ్యర్థన మేరకు ఎస్వీ యూనివర్సిటీలో ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన కుక్కలను, జింకలను, ఆవులు గేదెలు ఆహారంగా తీసుకెళుతుందన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని సూచనలు చేస్తూ విద్యార్థినీ విద్యార్థులు, వర్సిటీలో పనిచేసేవారు రాత్రి 8 నుంచి ఉదయం 6:30 వరకు వర్సిటీలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా క్యాంటీన్, హాస్టల్స్ నందు వచ్చే ఆహార వ్యర్ధ పదార్థాలు, వాకర్స్ అందించే ఆహార పదార్థాలు కుక్కలు వర్సిటీలోనే సంతతిని అభివృద్ధి చేసుకుంటాయన్నారు. కనుక దీనిని నిరోధించాలన్నారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండటంవల్ల ఇక్కడ నివాసం ఉండేవారు ఆవులు, గొర్రెలు, బర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలు తదితర డొమెస్టిక్ అనిమల్స్ పెంచుకోవద్దన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News