మాజీ సైనికులు చేసిన సేవలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి ఈ నెల 16న స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాజీ సైనికుల భారీ ర్యాలీ(Rally of ex-servicemen) నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి యం.డి.రజాక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -
ప్రత్యక్ష సేవలు, సంక్షేమ పథకాలు, వితంతువుల గౌరవం, ఆర్థిక సహాయం, వైద్య, ఆరోగ్యసేవలు, పింఛన్, భూ సమస్యలు, విద్యా అవకాశాలు, వైకల్య పింఛన్, సీఎస్డీ సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం, సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ సైనికుల ర్యాలీని నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
- గ్రీవెన్స్ పరిష్కారం స్టాళ్లు:
ఈ ర్యాలీలో గ్రీవెన్స్ పరిష్కారం స్టాళ్లు ఏర్పాటు చేయబడతాయి, పింఛన్, SPARSH సంబంధిత సమస్యలు, వైకల్య పింఛన్, కుటుంబ పింఛస్, పెండింగ్ అరియర్స్ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. సంబంధిత సమస్యలను తక్షణ పరిష్కారం చూపబడతాయి.
- ECHS, బ్యాంకులు, రికార్డు కార్యాలయాలు, PCDA (Pension) నుండి అధికారులు హాజరై సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తారు.
- ECHS మెడికల్ క్యాంప్: వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలులు చేసి మందుల పంపిణీ చేయబడుతాయి.
- CSD స్టాల్: CSD క్యాంటీన్ కార్డుల పునరుద్ధరణ, అర్హత సమస్యలు, అందుబాటులో ఉన్న వస్తువులు గురించి అవగాహన కల్పించబడుతుంది
- రికార్డ్ ఆఫీస్: సర్వీస్ డాక్యుమెంటేషన్, PART II ఆర్డర్ల సాధ్యం
- ఆర్థిక సహాయం బ్యాంక్ స్టాళ్లు: ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం
- వీరనారీమణులు గౌరవ కార్యక్రమం:
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలకు (వీరనారీమణులు), శౌర్య అవార్డు గ్రహీతలకు ప్రత్యేకంగా సన్మానం. ఈ కార్యక్రమం ద్వారా వారి సేవలను గుర్తించి, వారికి పౌరసత్తా, గౌరవం మరియు సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడం ముఖ్యమైనది.
- భూ సమస్యలు & చట్టపరమైన పరిష్కారం:
మాజీ సైనికుల కుటుంబాలు వ్యవసాయ భూములు, భూసమస్యలు, విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి సమస్యలపై తగు సూచనలు, సలహాలు అందించడంతో పరిష్కారం చూపబడును. వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై సహాయం పొందవచ్చు. - ఉద్యోగ & పునరుద్యోగ అవకాశాలు:
- DGR (Directorate General Resettlement), ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.
- ఇతర సదుపాయాలు :ఉచిత భోజనం, రవాణా సౌకర్యం అందించబడుతుంది.
- మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ అధికారి. కడప మరియు అన్నమయ్య జిల్లా 8688817828 సంప్రదించగలరు.
- ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికులు, వీరనారీమణులు వారి కుటుంబ సభ్యులు ఈ ర్యాలీకి హాజరై విలువైన సలహాలు, సూచనలు పొంది తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లాల జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆ ప్రకటనలో కోరారు.