Monday, November 17, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Buzz: డీమాన్ పెద్ద ఫ్లవర్.. ఫైరుగా ఉండి వైల్డ్ ఫైర్ చేశాను.. ఎలిమినేషన్ తర్వాత...

Bigg Boss Buzz: డీమాన్ పెద్ద ఫ్లవర్.. ఫైరుగా ఉండి వైల్డ్ ఫైర్ చేశాను.. ఎలిమినేషన్ తర్వాత మనీష్ రియలైజేషన్

Bigg Boss Buzz: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రెండోవారం ఊహించని ఎలిమినేషన్ జరిగింది. కాగా.. మర్యాట మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటారు. ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బజ్‌కు హోస్ట్‌గా చేస్తున్న హీరో శివాజీ ఎలిమినేట్ అయిన కామనర్ మనీష్ మర్యాదను నోరు జారావని చెప్పుకొచ్చాడు. కాగా.. దీనికి సంబంధించిన బిగ్ బాస్ బజ్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమో వివరాలేంటో చూసేద్దాం.

- Advertisement -

ఫైరు ఎవరు ఫ్లవర్ ఎవరు

రెండో వారం ఎలిమినేట్ ఇక హౌజ్‌లోకి కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద బిగ్ బాస్ 9 తెలుగు రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు. అతన్ని బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. “ఫైరు ఎవరు ఫ్లవర్ ఎవరు” అని హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి అడిగాడు శివాజీ. డీమోన్ ఫ్లవర్ అని చెప్పిన మనీష్ “టాప్ 7 మెటీరియల్ కానీ, ఎందుకో ఒక టైమ్‌లో వెళ్లిపోతారని కొడుతుంది కొంచెం” అని చెప్పాడు.

Read Also: Maryada Manish: ఏం గేమ్ సార్ మీది.. భరిణిపై మనీష్ ప్రశంసలు.. ప్రియాశెట్టిపై బిగ్ బాంబ్

ఆమె వల్ల గేమ్ ఇంపాక్ట్ అవ్వలేదు..

తనూజ గౌడ గురించి కూడా మానీష్ చెప్పుకొచ్చాడు. “తన వల్ల గేమ్ ఇప్పటికీ ఇంపాక్ట్ అవ్వలేదు” అని తనూజ గౌడ గురించి చెప్పాడు. తర్వాత “ఇతను 3 విషయాలు బాగా మ్యానేజ్ చేస్తాడు. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్, సెకండ్ ఎమోషన్స్, థర్డ్ టాస్క్. ఇంకేం కావాలి సర్” అని జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ గురించి గొప్పగా చెప్పాడు మనీష్ మర్యాద. “హౌజ్ నుంచి వచ్చాక ప్రియా గురించి మీ అభిప్రాయం ఏంటీ” అని శివాజీ అడిగాడు. “నేను అయితే హౌజ్‌లో ఉంటే వచ్చే వారం నామినేట్ చేసేవాన్ని” అని మనీష్ అన్నాడు. “మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. కానీ, మీరు మాట కూడా జారారు” అని శివాజీ అన్నాడు. కాగా.. ఔనని తన తప్పు ఉందని మనీష్ ఒప్పుకున్నాడు.

Read Also: Maryada Manish Elimination: మనీష్ ఎలిమినేషన్.. బాటమ్ త్రీలో ఉండేది ఆ ముగ్గురే..!

ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నా..

“ఎందుకో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా బిహేవ్ చేస్తున్నాడనిపించింది” అని శివాజీ అంటే.. “నేను కూడా నోటీస్ చేశాను” అని తప్పు ఒప్పుకున్నాడు మనీష్. “మీ దగ్గర యూనిటీ ఉందా. ఉంటే ఎవరెవరితో ఎవరెవరికి ఉంది. మీరు శ్రీజ, ప్రియ ఇంత చేయడం వల్ల ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టారు అక్కడ” అని శివాజీ అన్నాడు. యాక్చువల్‌గా నేను ఫైరుగా ఉండి వైల్డ్ ఫైర్ చేశానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది.. అని నవ్వాడు మర్యాద మనీష్. అంతటితో తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 9 తెలుగు బజ్ ప్రోమో ముగిసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad