Sunday, November 16, 2025
HomeTop StoriesBIgg Boss9:మాటతీరే ముఖ్యం అంటూ దివ్వెల మాధురికి గట్టిగా ఇచ్చిపడేసిన కింగ్‌ నాగార్జున..!

BIgg Boss9:మాటతీరే ముఖ్యం అంటూ దివ్వెల మాధురికి గట్టిగా ఇచ్చిపడేసిన కింగ్‌ నాగార్జున..!

Bigg Boss Telugu promo:బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. టాస్కులు, గొడవలు, స్నేహాలు, భావోద్వేగ సన్నివేశాలు ఇలా అన్ని కలిసి ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపడేస్తున్నాయి.గత వారం రోజులుగా హౌస్‌ లోకి కొత్త కంటెస్టెంట్లు రావడంతో వచ్చిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి. దీంతో వాతావరణం మరింత హీటెక్కింది.

- Advertisement -

కొత్తవారి రాకతోపాటు, పాతవారి మధ్య ఉన్న విభేదాలు కూడా బయటకు పడుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రతి వారం ఎవరైనా ఒకరు బయటకు వెళ్తుండగా, గత వారం ఇద్దరికి ఎలిమినేషన్ తగిలింది. ఇప్పుడు వచ్చే వీకెండ్‌లో ఎవరు ఎగ్జిట్ అవుతారన్నది అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.

Also Read: https://teluguprabha.net/biggboss/bigg-boss-9-telugu-updates-bharani-shankar-requests-emmanuel/

ఇక నేడు శనివారం కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున హౌస్‌లో కంటెస్టెంట్లకు ఇచ్చిన క్లాస్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఎప్పటిలాగే వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ హౌస్‌లోకి వచ్చి అందరితో సమీక్ష మొదలుపెట్టారు. మొదట మాధురి, కళ్యాణ్ మధ్య జరిగిన వివాదంపై ఆయన చర్చించారు. ఆ గొడవలో ఎవరి తప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవడానికి కొత్త పద్ధతిని అనుసరించారు.

కిరీటాలు పెట్టి..

హౌస్‌లో ఉన్నవారికి కిరీటాలు పెట్టి, వాళ్లు నిజంగా అర్హులా కాదా అని అడిగి, అందరి స్పందన తెలుసుకున్నారు. అలాగే ఆడియన్స్‌కు ఓటింగ్ ప్యాడ్లు ఇచ్చి వారిని కూడా నిర్ణయంలో భాగస్వామ్యం చేశారు. నాగ్ మొదట మాధురిని, ఆ తర్వాత సుమన్ శెట్టిని లేపి మాధురి–కళ్యాణ్ గొడవలో తప్పు ఎవరిది అని అడిగారు. సుమన్, మాధురిగారిదే తప్పు అని సమాధానం ఇచ్చాడు. వెంటనే నాగార్జున ఆ సంఘటనకు సంబంధించిన వీడియో చూపించి అందరికీ స్పష్టత ఇచ్చారు.

చెప్పిన తీరు సరిగా లేదని ..

వీడియో చూసిన తర్వాత మాధురి తన వైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే నాగార్జున, ఆమె మాటల్లో నిజం ఉన్నప్పటికీ, చెప్పిన తీరు సరిగా లేదని సూచించారు. అనంతరం ఆడియన్స్ ఓటింగ్‌లో కూడా 60 మంది మాధురిగానే తప్పు చేశారని ఓటేశారు. దాంతో ఆమె షీల్డ్ నుంచి ఉన్న పవర్ స్టోన్‌ను నాగార్జున తీసేశారు. ఆ నిర్ణయం హౌస్‌లో ఉన్నవారికి పెద్ద షాక్‌గా మారింది.

పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్..

తర్వాత నాగ్, అయేషాను లేపి ఆమె దగ్గర ఉన్న పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ గురించి మాట్లాడారు. అయేషాకు కిరీటం పెట్టి, ఆమెను అడిగారు తను అర్హురాలా కాదా అని. అయేషా తనను తాను అర్హురాలేనని చెప్పింది. అయితే నాగార్జున ఆమె మాటల్లో ఒక టార్గెట్ ఉందని గమనించి, వెంటనే ఆమెపై కౌంటర్ వేశారు. ఆ సమయంలో హౌస్ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది.

సీన్‌లో పాత కంటెస్టెంట్లకు…

తర్వాత రీతూను అడగ్గా, ఆమె మొదట అయేషా అర్హురాలని చెప్పి, తరువాత నాగ్ క్లారిటీగా అడిగినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంది. నిఖిల్ గురించి నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను ప్రశ్నించగా, అతడు తన దృక్పథాన్ని వివరించాడు. అలాగే సాయి గురించి భరణిని అడిగారు నాగ్. ఈ మొత్తం సీన్‌లో పాత కంటెస్టెంట్లకు నాగార్జున ఇచ్చిన కౌన్సిలింగ్ కాస్త కఠినంగా అనిపించింది.

హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ క్లాస్ తర్వాత తమ ప్రవర్తనను మరోసారి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాధురి విషయంపై ఆడియన్స్ తీర్పు బయటపడటం హౌస్ వాతావరణాన్ని బాగా ప్రభావితం చేసింది. ఆమెకు సపోర్ట్ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు కూడా ఈ ఫలితంతో నిరుత్సాహానికి గురయ్యారు.

సోషల్ మీడియాలో కూడా…

అదే సమయంలో కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లకు కిరీటాలు పెట్టి, వాళ్లు హౌస్‌లో స్థిరపడటానికి ఎంత అర్హులన్నది పరిశీలించడం నాగార్జున ప్రత్యేక శైలిగా మారింది. ఆ విధానం ప్రేక్షకులకూ కొత్త అనుభూతిని ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రోమోపై చర్చలు ఊపందుకున్నాయి. చాలామంది నాగార్జున క్లాస్‌ను ఈ సీజన్‌లోని అత్యంత ఎంటర్టైనింగ్ సెగ్మెంట్‌గా అభివర్ణిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/biggboss/bigg-boss-9-telugu-updates-ayesha-fires-on-kalyan/

రాము రాథోడ్ వెళ్లే అవకాశాలు…

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే, ఈ వారం హౌస్ నుంచి రాము రాథోడ్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటింగ్ లెక్కల్లో ఆయనకు చాలా తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఆయనకు అభిమానుల మద్దతు తగ్గింది. ఆ కారణంగా ఈ వీకెండ్ ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad