Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Maryada Manish: ఏం గేమ్ సార్ మీది.. భరిణిపై మనీష్ ప్రశంసలు.. ప్రియాశెట్టిపై బిగ్ బాంబ్

Maryada Manish: ఏం గేమ్ సార్ మీది.. భరిణిపై మనీష్ ప్రశంసలు.. ప్రియాశెట్టిపై బిగ్ బాంబ్

Maryada Manish: బిగ్‏బాస్ సీజన్ 9 తెలుగు సెకండ్ వీక్ ఊహించని ఎలిమినేషన్ జరిగింది. కామనర్స్ నుంచి మర్యాద మనీష్ బయటకు వచ్చాడు. మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ కాగా.. చివరకు ఫ్లోరా, మనీష్ డేంజర్ జోన్ లో నిలిచారు. వీరిలో మనీష్ ఔట్ కాగా.. ఫ్లోరా సేవ్ అయ్యింది. ఇక వెళ్తూ వెళ్తూ తన దృష్టిలో టాప్ 3, బాటమ్ 3 గురించి చెప్పాడు. బాటమ్ త్రీలో దమ్ము శ్రీజ, ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి పేర్లు చెప్పారు. ఆ తర్వాత టాప్-3లో మొదటిగా భరణి పేరు చెప్పాడు మనీష్. నా ప్రకారం నెం.1 భరణి గారు.. నేను అతను నెం.1 అనే విషయంలో ఎప్పుడూ గొడవపెట్టుకోలేదు.. అతని గేమ్ నేను చాలా నోటీస్ చేస్తాను.. అందరికీ తెలుసు నేను చాలా గమనిస్తూ ఉంటానని.. సార్ మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు.. నేను మీతో ఆ బ్యాటిల్ చేయకపోతే ఇంత తృప్తిగా నేను బయటికి రాకపోయేవాడ్ని.. మీరు అందరి గురించి కేర్ తీసుకుంటారు.. అందరి గురించి ఆలోచిస్తారు.. సేమ్ టైమ్ గేమ్ కూడా ఆడతారు.. నేను అన్నీ నోటీస్ చేస్తున్నాను.. అయితే మీలో కొన్ని కొన్ని నాకు నచ్చట్లేదు దాని కోసమే మన మధ్య చిన్న విభేదాలు వచ్చాయి.. కానీ నా దృష్టిలో మీరు చాలా స్ట్రాంగెస్ట్ కంటెండర్లలో ఒకరు.. మీలాంటి వాళ్లతోటి నేను స్టేజ్ షేర్ చేసుకున్నందుకు.. ఒక మంచి కాంపిటేషన్ ఇచ్చినందుకు.. మీలాంటి వాళ్లతో ఫైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను..అంటూ మనీష్ గొప్పగా చెప్పాడు.

- Advertisement -

ఇమ్మాన్యూయేల్ పై ప్రశంసలు..

నెక్స్ట్ టాప్-3లో ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు మనీష్. ఇమ్మాన్యుయేల్.. బై చెప్పలేదు సార్ నాకు ఈరోజు.. నేను ఇమ్మాన్యుయేల్‌ని  మొదట్లో వచ్చినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు ఎందుకంటే కామెడీ చేస్తారు అదీ ఇదీ అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు.. మొదటి రోజు నుంచి ఇచ్చిపడేశావన్నా.. అంటే కామెడీ ప్లస్ గేమ్ ప్లస్ ఎమోషన్స్ అన్నీ ఈ రేంజ్‌లో ఎలా హ్యాండిల్ చేస్తున్నావో నాకు అయితే అర్థం కావట్లేదు.. అలానే నాకు అండగా ఉన్నందుకు థాంక్యూ.. మిమ్మల్ని నేను కంపల్సరీ టాప్-3లో చూడాలనుకుంటున్నాను.. వేరే వాళ్ల కోసం మీరు గేమ్ గివప్ చెయ్యకండి.. నిన్ను కూడా చెప్పాను మీకు.. ప్లీజ్ ఫైట్ చేయండి.. అంటూ మనీష్ బూస్ట్ ఇచ్చాడు. తప్పకుండా మిస్ యూ బ్రదర్.. అంటూ ఇమ్మూ చెప్పగా మిస్ యూ సార్.. అంటూ మనీష్ అన్నాడు.

Read Also: Beauty Tips: యంగ్ గా కన్పించాలంటే ఏం చేయాలో తెలుసా?

కామనర్ల నుంచి ఒకే ఒక్కడు

ఇక టాప్-3లో ఒక్కరిని కాదు మరో ఇద్దర్ని పెట్టొచ్చా అని మనీష్ అడిగితే నాగ్ ఓకే అన్నారు. దీంతో ముందుగా హరీష్ ఫొటో బోర్డ్ మీద పెట్టాడు. హరీష్ గారు ఫెంటాస్టిక్ ప్లేయర్ సార్.. అతనికి గేమ్ ప్లే తెలుసు క్లారిటీ ఆఫ్ థాట్ చాలా చాలా క్లియర్ ఉంది.. ఒక్కటే సార్ నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఎమోషన్స్‌తో క్యారీ వే కాకండి.. కొంచెం కోపం తగ్గించుకోండి మీరు కచ్చితంగా టాప్ 1కి వెళ్తారని నాకు తెలుసు.. మీరు కూడా నా టాప్-3 కంటెస్టెంట్లలో ఒకరు.. అంటూ మనీష్ అన్నాడు. మనీష్ పెట్టిన టాప్-3లో కామనర్ల నుంచి కేవలం హరీష్ ఒక్కడే ఉండటం విశేషం.

Read Also: Maryada Manish Elimination: మనీష్ ఎలిమినేషన్.. బాటమ్ త్రీలో ఉండేది ఆ ముగ్గురే..!

సంజనా గేమ్ కి నా మైండ్ దొబ్బింది

ఇక టాప్-3లో మనీష్ పెట్టిన మరో పేరు సంజన. సంజన గారు.. నేను ఎంత మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నానో ఆ తర్వాత తనని అంత అర్థం చేసుకున్నాను.. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఈమె కంటెంట్ కోసం చేస్తుంది అది ఇది అని ఎన్నో మాటలన్నాను.. పాపం నాకే బాధేస్తుంది.. నాకు పని లేకుండా నేను అటు సైడ్ ఉంటే ఈమెకి పని లేకుండా ఇటు సైడ్ ఉంది.. కానీ తిను ఏం చేసిందంటే నాకు పని రాలేదు కదా నేనే పని తెచ్చుకుంటా గేమ్‌యే అది కదా అని ఏం ఆలోచించింది అసలు.. నాకు అప్పటి నుంచి మైండ్ పోయింది.. ఈ విషయం ఎవరికీ తెలీదు పగలు అందర్నీ సతాయిస్తుంది.. రాత్రి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది..

సంజన ఒకటే ఏడుపు

ఆరోజు నేను రాత్రి ఉన్నప్పుడు నాకు తెలుసు హౌస్‌‌లో నేను ఎవరినైనా ఎక్కువ మిస్ అవుతానంటే అది సంజననే.. అంటూ మనీష్ అన్నాడు. దీంతో ఇంత తొందరగా పోవాల్సిన అవసరం ఉందా నీకు.. అంటూ సంజన ఎమోషనల్ అయింది. 13 డేస్ అందర్నీ వర్క్ అడిగాను సార్ నేను.. ఈమె ఒక్కర్తే నాకు వర్క్ ఇచ్చింది.. ఆమెకి నేను వంట చేసి పెట్టాను.. నాకు చాలా హ్యాపీగా ఉంది.. మీరు టాప్-3లో ఉండాలని నేను కోరుకుంటున్నాను.. భాష నీకు అడ్డం కాదు.. నువ్వు స్ట్రాంగెస్ట్ కంటెంస్టెంట్.. అని మనీష్ అన్నాడు. దీనికి నేను తెలుగమ్మాయినే నాకు భాష ఏం అడ్డం కాదు.. అంటూ సంజన చెప్పింది. ఐ లవ్యూ సంజన.. అంటూ మనీష్ ఎమోషనల్ అయ్యాడు.

ప్రియపై బిగ్ బాంబ్

కానీ వెళ్లే ముందు ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్లాలి.. హౌస్‌మేట్స్ అందరూ మోస్ట్ బోరింగ్ పర్సన్ కింద ఫ్లోరాని సెలక్ట్ చేశారు.. దీంతో ఫ్లోరా ఈరోజు జైల్లోకి వెళ్లిపోతుంది.. సో వాష్ రూమ్స్ డ్యూటీ కొత్త వ్యక్తికే వేయాలి..అది కూడా టెనెంట్స్ నుంచే వేయాలి.. అని నాగార్జున అన్నారు. దీంతో ఈ ఇంట్లో నాకు ఒకరితోటి లవ్-హేట్ రిలేషన్‌షిప్ ఉందంటే అది ఒకరితోటే అది ఆమెకి కూడా తెలుసు.. అది ఎవరో కాదు ప్రియనే.. ప్రియ నా ప్రకారం బలమైన కంటెస్టెంట్లలో ఒకరు.. ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్పాను.. ఇది నీకు చిన్న లెర్నింగ్‌లా ఉంటుందని నా రివెంజ్‌గా నీకు ఈ డ్యూటీ వేసి వెళ్తున్నా అంటూ మనీష్ షాకిచ్చాడు. ఇలా ఊహించని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ 9 మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad