Bigg Boss Elimination: బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. అందులో ఒక కంటెస్టెంట్ ఫ్లోరా కాగా మరొకరు దమ్ము శ్రీజ. అయితే, ఉన్న కంటెస్టంట్లలో శ్రీజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాంటి శ్రీజని ఎలా ఎలిమినేట్ చేశారా అని ఆడియన్స్ అవాక్కవుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురు సభ్యులకి వివిధ టాస్కులు పెట్టి అందులో బాటమ్-2లో మిగిలిపోయిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేశారు వైల్డ్‌కార్డ్స్.
ఓటింగ్ తో సంబంధం లేకుండా..
బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరగబోతుంది. బిగ్‌బాస్ 2.0లో భాగంగా హౌస్‌లోకి ఆరుగురు వైల్డ్‌కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఓటింగ్ ఆధారంగా లీస్ట్‌లో ఉన్న ఫ్లోరా సైనీ ఎలాగో ఎలిమినేట్ కాబోతుంది. అయితే ఆమె కాకుండా దమ్ము శ్రీజని కూడా ఎలిమినేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో డేంజర్ జోన్‌లో ఉన్న మీ ఐదుగురు సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు ఇది మొదటి టాస్క్.. అంటూ నాగార్జున ‘స్టిక్ ఇట్ టూ విన్ ఇట్’.. అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్కులో డేంజర్ జోన్‌లో ఉన్న రీతూ, డీమాన్, సంజన, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ ఆడారు. ఇక ఈ టాస్కుని వైల్డ్‌కార్డ్ ఎంట్రీ అయిన రమ్య మోక్ష సహా మరొకరు నిర్వహించారు.
సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్..
ఆ తర్వాత బ్లాక్స్ స్టార్స్‌లో ఒక్కరికి ఇప్పుడు సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం వస్తుంది.. అంటూ మరో టాస్క్ ఇచ్చారు. 10 వస్తువులతో తమకి నచ్చిన నాలుగు వస్తువులను ఒకటి తర్వాత ఒకటి తమ బీకర్‌లో వేసి వారి బీకర్‌ని ఎక్కువ స్థాయిలో నిండేలా చూసుకోవాలి.. అంటూ పెట్టిన ఈ టాస్కులో సుమన్, శ్రీజ, డీమాన్ పాల్గొన్నారు. అంటే అప్పటికే సంజన, రీతూ సేఫ్ జోన్‌కి వెళ్లిపోయారన్నమాట. ఈ టాస్క్ దివ్వెల మాధురి కండెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రోమో చివరిలో నాగార్జున షాకిచ్చారు. మై డియర్ బ్లాక్ స్టార్స్ ఈ వారం మీరు వేరియస్ లెవల్స్‌లో గేమ్స్ ఆడారు.. ఈ అన్ని టాస్కుల్లో సేఫ్ జోన్‌లోకి వెళ్లకుండా డేంజర్ జోన్‌లో మిగిలిపోయింది మీ ఇద్దరూ.. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మీ ఇద్దరిలో ఒకరిని ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయబోతున్నారు.. అంటూ నాగార్జున ప్రకటించారు. అప్పటికి డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి-దమ్ము శ్రీజ మాత్రమే ఉన్నారు.
Read Also: Bigg Boss Updates: వైల్డ్ కార్డ్స్.. ఫైర్ స్ట్రామ్ ప్రోమో రిలీజ్.. ఏకంగా ఆరుగురి ఎంట్రీ..!
వైల్డ్ కార్డ్స్ డిసిషన్..
ఇక వైల్డ్ కార్డ్స్ ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండాలి.. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది డిసైడ్ చేశారు. ఇద్దరికీ బెలూన్స్ కట్టగా తమకి నచ్చని క్యాండెట్ బెలూన్స్‌ని వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు కట్ చేయాలి. ఇందులో శ్రీజ బెలూన్స్‌ని మాధురి కట్ చేసినట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది. యూ ఆర్ ఎలిమినేటెడ్.. అంటూ నాగార్జున చివరిలో ప్రకటించగా హౌస్‌మేట్స్ అందరూ షాకయ్యారు. ముఖ్యంగా కళ్యాణ్ స్టన్ అయిపోయాడు. అయితే, ప్రోమో చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నారు. శ్రీజ రీఎంట్రీకి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


