Sunday, November 16, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss New Episode: దుమ్ము దులిపిన దమ్ము శ్రీజ.. ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో...

Bigg Boss New Episode: దుమ్ము దులిపిన దమ్ము శ్రీజ.. ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ ఫైర్

Bigg Boss New Episode: బిగ్ బాస్ లో రెండో వారం నామినేషన్స్ గరం గరంగా సాగాయి. లేడీస్ బ్యాచ్ అంతా గుండు అంకుల్ ని టార్గెట్ చేసింది. మంగళవారం ఎపిసోడ్ లో హరీష్ ని  రీతూ చౌదరి దులిపేసింది. ఆ తర్వాత దమ్ము శ్రీజ కూడా హరీష్‌ని నామినేట్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓనర్స్-టెనెంట్స్ అంటూ మనల్ని డివైడ్ చేశారు ఓకే.. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఇండివీడ్యువల్ గేమ్ అలానే గ్రూప్ గేమ్ కూడా.. అయితే ఫస్ట్ డే మీరు ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా అయితే నేను తీసుకుంటాను నాది బాధ్యత అన్నారు.. సెకండ్ పాయింట్ థంమ్స్ అప్ కూడా దొంగతనం చేశారు.. ఇవన్నీ మీ పర్సనల్ డెసిషన్స్.. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సంజన గారిని నా ఓన్ రీజన్స్‌తో నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను.. చేశాను.. అయితే గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు .. శ్రీజతో మాట్లాడను చాలా కోపంగా ఉన్నాను శ్రీజ మీద అని చెప్పారట.. నా ఇండివీడ్యువల్ గేమ్ నేను ఆడినందుకు మీరు నా మీద కోపపడ్డారు .. చాలా సార్లు నీ వల్లే అయింది నీ వల్లే ఇదంతా జరిగింది అని డైలాగ్స్ వేశారు.. అది నాకు నచ్చలేదు.. అంటూ శ్రీజ చెప్పింది.

- Advertisement -

Read Also: Bigg Boss New Promo: మొహానికి పెయింట్ పూసి.. హీటెక్కించేలా నామినేషన్స్..!

ఇమ్మూ రెడ్ ఫ్లవర్ ఇష్యూ

సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుందని మీరే అంటుంటారు.. ఆ క్లిప్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికీ కూడా మీరు నిజంగానే ఇమ్మూని అలా అన్నారన్న పాయింట్ అర్థమవుతుంది.. అంటూ శ్రీజ చెప్పింది. ఇమ్మానుయేల్ గారే స్టార్ట్ చేశారు బాడీ షేమింగ్ అనేది.. నాకు రిజిస్టర్ అవ్వలేదు టెక్నికల్‌గా.. ఆ తర్వాత ప్రియ గారు ఇమ్మానుయేల్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏం ఆ కాంటెస్ట్‌లో ఆయన్ని ఉద్దేశించి అనలేదు..అంటూ మట తిప్పేశాడు హరీష్. కానీ ఆ వీడియోలో మీరు ఇమ్మూని రెడ్ ఫ్లవర్ అన్నది క్లియర్‌గా ఉంది.. అని శ్రీజ చెప్పింది. సో నేను అలా అన్నందుకు అతను నన్ను బాడీ షేమింగ్ చేశాడని మీరు అంటున్నారా.. అని శ్రీజని ఇరికించాలని చూశాడు. నేను అలా కూడా అనట్లేదు.. మీకు తెలీకుండా రెడ్ ఫ్లవర్ అనేశారు కదా.. అలానే అతను వద్దన్నా కూడా మీరు బాడీ షేమింగ్ చేశారు.. అంటూ శ్రీజ చెప్పింది. అది ఇమిటేషన్ బాడీ షేమింగ్ కాదు.. మీకు అసలు ఇరిటేషన్, బాడీ షేమింగ్‌కి తేడా తెలీనప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పక్కర్లేదు.. అంటూ తప్పించుకున్నాడు హరీష్.

నోటికొచ్చినట్లు మాట్లాడతారు..

మీరు నామినేషన్స్‌లో కూడా ఆయన్ని(ఇమ్మూ) వెక్కిరించారు.. నోటికొచ్చినట్లు మాట్లాడతారు.. మీకు ఒక షో ఫార్మాట్‌కి వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు.. ఫస్ట్ రోజు నుంచి ఐ క్విట్ క్విట్ అంటూనే ఉన్నారు.. అని శ్రీజ ఇంకా రెచ్చగొట్టింది. ఇలాంటోళ్ల దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాను.. అని హరీష్ అనగానే మరి వెళ్లిపోవచ్చు కదా.. అంటూ శ్రీజ అంది. దీంతో పంపిస్తే వెళ్లిపోతాం.. దమ్ముంటే అడగండి బిగ్‌బాస్‌ని.. అంటూ హరీష్ రెచ్చిపోయాడు. ఈ మాటకి తనూజ, రీతూ రియక్ట్ అయ్యారు. మీరు కరెక్ట్‌గా మాట్లాడండి.. దమ్ముంటే పంపించండి అనడమేంటి.. అంటే బిగ్‌బాస్‌కే దమ్ములేదు అంటున్నారా.. అని ఇద్దరూ మధ్యలో మాట్లాడారు. మా ఇద్దరికి సంబంధించిన విషయంలో దూరతున్నారు కదా దమ్ముంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి.. అంటూ వాళ్లపై ఫైర్ అయ్యాడు హరీష్. మీరు దమ్ము గురించి మాట్లాడటం కాదు ఫస్ట్ ఒక ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి.. అంటూ ఇద్దరూ గట్టిగానే ఫైర్ అయ్యారు. పానకంలో పుడకల్లా వస్తున్నారు.. అని హరీష్ నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడాడు. అబ్బో వెళ్లి చప్పట్లు కొట్టుకోండి.. అంటూ రీతూ వెక్కిరించింది. చివరికి మీ లాంటి వాళ్లు మాకు ఇంట్లో వద్దు.. అంటూ హరీష్‌ని శ్రీజ నామినేట్ చేసింది. ఇలా నామినేషన్స్‌లో హరీష్‌ని లేడీ శివంగులంతా మాస్క్ మ్యాన్ పై విరుచుకుపడ్డారు.

Read Also: Bigg Boss 9 Written Updates: హరీష్ కి మోత మోగిపోయింది.. సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నారా అంటూ ఏకిపారేసిన రీతూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad