Monday, November 17, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Updates: ఉతుక్కో.. ఆరబెట్టుకో.. నాకేం కర్మ.. కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన అయేషా

Bigg Boss Updates: ఉతుక్కో.. ఆరబెట్టుకో.. నాకేం కర్మ.. కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన అయేషా

Bigg Boss Updates: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు కెప్టెన్లు అయ్యారు. శుక్రవారం ఎపిసోడ్‌లో కీలకమైన కెప్టెన్సీ టాస్కులు జరిగాయి. కెప్టెన్సీ కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళాల్సిన అవసరం ఉంది.. ఎందుకంటే ఈ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు.. అంటూ బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఇద్దరు కెప్టెన్లు వారికి లభించబోయే ప్రయోజనాలను మరియు బాధ్యతలను పంచుకోబోతున్నారు .. కాబట్టి మీ భాగస్వామిని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి.. ఎందుకంటే మీ గెలుపోటములు మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి.. అంటూ కంటెండర్లకి బిగ్‌బాస్ సూచనలు చేశాడు. దీంతో ఆరుగురూ డిస్కస్ చేసుకున్నారు. రమ్యతో మాధురి టీమ్ అప్ అవుదామని అనుకుంది. కానీ రమ్య-సాయి కలిసి టీమ్‌గా ఆడదామని డిసైడ్ అయ్యారు. ఇక గౌరవ్-సుమన్, అయేషా-మాధురి టీమ్‌లుగా డివైడ్ అయ్యారు. ఈ విషయంలో మాధురి హర్ట్ అయింది. నన్ను ఈరోజు నువ్వు చాలా బాధపెట్టావ్ రమ్య.. ఈ హౌస్‌లో నాకు నీ సపోర్ట్ ఉందనుకున్నాను కానీ లేదని ఇప్పుడు తెలిసింది.. అని చెప్పింది. నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయనివ్వండి.. అని రమ్య అంటుంటే అవన్నీ కాదురా నాకు నువ్వు కావాలి అనుకున్నాను.. అని మాధురి చెప్పింది. నేను నిన్ను మోసం చేశానని అనుకుంటున్నావా.. అని రమ్య అడిగితే నన్ను హర్ట్ చేశావని అనుకుంటున్నా.. అని మాధురి రిప్లయ్ ఇచ్చింది. ఏం హర్ట్ చేశాను నేను.. అని రమ్య అడిగింది. ఎందుకో అలా అనిపిస్తుంది నాకు.. సింగిల్‌గా వచ్చాను సింగిల్‌గానే ఆడి పోతాను.. అంటూ మాధురి డైలాగులు కొట్టింది.

- Advertisement -

గెలిచి కెప్టెన్లుగా

నిన్న జరిగిన టాస్కులో తమ కంటెండర్‌షిప్ కాపాడుకొని నిలిచిన ఆరుగురు సభ్యులు ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు.. గెలిపొంచు..ఈ టాస్కులో గెలిచిన జంటలోని ఇద్దరు సభ్యులు హౌస్‌ కెప్టెన్లు అవుతారు.. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల లాక్ అయి ఉంటారు.. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి అక్కడ తన పార్టనర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి.. ఆ కోడ్ కనుక్కోవడానికి కావాలస్సిన క్లూ సమాధి లోపలే ఉంటుంది.. ముందుగా ఎవరు తమ పార్టనర్‌ని విడుదల చేస్తారో వాళ్లు ఈ టాస్కు విజేతలు అవుతారు..అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్ లో ఈ టాస్కు ఇలా మొదలుకాగానే చకచాకా కేజ్ నుంచి వాకీ టాకీ తీసుకొని మాధురి ఇచ్చిన సూచనల ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేసింది అయేషా. అలానే పరిగెత్తుకొని లోపలికి అయితే వెళ్లింది. కానీ అక్కడ మాధురి ఉన్న సమాధికి ఏర్పాటు చేసిన తాళానికి కావాల్సిన పాస్ వర్డ్ రాంగ్ ఎంటర్ చేసింది. దీంతో అది ఓపెన్ కాలేదు. మరోవైపు తర్వాత వెళ్లిన సాయి.. రమ్య ఏ బాక్స్‌లో ఉందో కనిపెట్టలేకపోయాడు. కానీ చివరిగా వెళ్లిన గౌరవ్ మాత్రం.. చాలా ప్రశాంతంగా సుమన్ శెట్టి పడుకున్న బాక్స్‌ని ఓపెన్ చేశాడు. దీంతో పరిగెత్తుకుంటూ ఇద్దరూ వెళ్లి గంట కొట్టేసి విన్ అయిపోయారు. సుమన్ శెట్టి అయితే ఫుల్ హ్యాపీ ఫీలైపోయాడు. రీతూ అయితే వచ్చి సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చింది.

Read Also: Bigg Boss Telugu 9: 500తో సిటీకి వచ్చాడు.. మొన్నటి వరకు కామెడీ షోలో.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో..

అయేషా ఏడుపు

ఇక గేమ్ పోయింది అనే బాధలో కింద కూర్చొని అయేషా తెగ ఏడ్చింది. నా కన్ను వల్ల పోయింది మేమ్.. నా లోపం వల్ల పోయింది.. నాకు కనబడలేదు అంటూ అయేషా తన చెంప మీద తానే కొట్టుకుంటూ ఏడ్చేసింది. దీంతో అందరూ తనని ఓదార్చడానికి వచ్చారు. నేనే ఫస్ట్ వచ్చాను.. అయినా కానీ ఓడిపోయాం.. నా కన్ను వల్ల పోయింది ఇమ్మూ నాకు కనబడలేదు ఇమ్మూ.. అంటూ అయేషా ఏడ్చింది. ఇది చూసి మాధురి కూడా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంది. దీంతో మాధురి గారు మీరు కూడా ఏడుస్తారేంటి.. అంటూ అందరూ ఓదార్చారు. కెప్టెన్ అయిన సంతోషంలో అధ్యక్షా.. సుమన్ శెట్టి అను నేను నీతిగా, నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నాను.. అని ఫుల్ ఎనర్జీతో అరిచాడు సుమన్ శెట్టి.

Read Also: Rekha Boj: కమిట్మెంట్స్ అడుతున్నారు.. బిగ్ బాస్ కోసం ట్రై చేశా కూడా..

కళ్యాణ్‌కి క్లాస్ పీకి అయేషా

సుమన్ శెట్టితో పాటు గౌరవ్ కూడా కెప్టెన్ అయ్యాడు. ఈ సంతోషం బావుంది అనేలోపే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్ మీ దగ్గరున్న కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అయ్యే సమయం వచ్చింది.. కొత్త కెప్టెన్స్ ఇద్దరిలో నుంచి మీరు ఒకరిని నేరుగా ఛాలెంజ్ చేయొచ్చని చెప్పాడు. దీంతో, అపోనెంట్ గా గౌరవ్ ని ఎన్నుకున్నాడు నిఖిల్. దీంతో, అందరూ హ్యాపీ అయ్యారు. ఎందుకంటే సుమన్ శెట్టితో కాకుండా తనకి దీటుగా ఉంటే గౌరవ్‌తో పోటీపడటానికి నిఖిల్ రెడీ అవ్వడం విశేషం. మరోవైపు డ్రెస్ ఐరన్ చేయడానికి హెల్ప్ చేద్దుగాని రా అంటూ అయేషాని పిలిచాడు కళ్యాణ్. ఎవరి పనో నేను ఎందుకు చేయాలిరా.. అంటూ అయేషా గట్టిగానే క్లాస్ పీకింది. కళ్యాణ్ చేతిలో ఉన్నది తనూజ డ్రెస్.. దీంతో అయేషా ఇలా రియాక్ట్ అయింది. నువ్వు కావాలంటే నీకు నచ్చినవాళ్ల డ్రెస్‌లు ఉతుక్కో, ఆరబెట్టుకో, ఐరన్ చేసుకో నాకేం కర్మ.. అంటూ ఇచ్చిపడేసింది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad