Bigg Boss Divvala: బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకూ చాలామందిని చూసి ఉంటారు. కానీ, మరీ ఇంత వరెస్ట్ కంటెస్టెంట్ ని ఇప్పటివరకు చూసి ఉండరు. ఆమె మరెవరో కాదు.. దివ్వెల మాధురి కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్. ఇలాంటి కంటెస్టెంట్‌ని ఎలా సెలెక్ట్ చేశావ్ బిగ్ బాస్‌గా అని జనం బండబూతులు తిడుతున్నారు. ఆమె అంతకంటే ఎక్కువ దిగజారదులే అని అన్న ప్రతిసారీ నో.. మీ అంచనా తప్పు అంటూ అంతకంతకూ దిగజారుతూనే ఉంది దివ్వెల మాధురి . బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది మొదలు.. తన వరస్ట్ బిహేవియర్‌తో అందరితోనూ చీ అనిపించుకుంటుంది.
ఇష్టారాజ్యంగా..
అది కూడా హౌస్‌లోకి వెళ్లి కనీసం వారం కాదు కదా.. ఒక్క రోజు కూడా కూడా కాకుండానే నోటికి పని చెప్పింది దివ్వెల మాధురి. వెళ్లడం వెళ్లడమే తన పేరు తెలియదని అన్నందుకు దమ్ము శ్రీజతో గొడవ పడింది. అప్పటి నుంచి మొదలు.. అది అసలు నోరా లేదంటే మురికి కుంటనా? అన్నంతగా.. నోరు తెరిస్తే చాలు గొడవ తప్పితే మరోటి లేదు. శ్రీజ మొదలు కళ్యాణ్, తనూజ, రీతూ, సంజనా, భరణి ఇలా ఒకటి రెండు రోజుల్లో వీళ్ళంతా దివ్వెల మాధురి బాధితులే. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కాకుండా.. హౌస్ మేట్స్‌కి సొంతంగా రూల్స్ పెట్టింది దివ్వెల మాధురి. మరి అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే.. దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. ఇక్కడంతా నేను చెప్పినట్టే వినాలి.. నేను పెట్టిన రూల్స్ ఫాలో కావాల్సిందే అంటూ హుకుం జారీ చేసింది. ఎవరైనా నోరు తెరిచి ఎదురు మాట్లాడితే.. వాళ్లపై పర్సనల్ ఎటాక్ చేస్తుంది. వాళ్ల క్యారెక్టర్ అదీ.. వీళ్ల క్యారెక్టర్ ఇదీ.. వాడు అమ్మాయిల పిచ్చోడు.. వీడు బాండింగ్స్ ఎక్కువ అంటూ అందరి ఎఫైర్ల గురించి మాట్లాడుతుంది దువ్వాడ శ్రీనివాస్‌తో ఎఫైర్‌లో ఉన్న దివ్వెల మాధురి.
Read Also: Bigg Boss New Promo: గౌరవ్ ఏంట్రా మరీ ఇలా ఉన్నావురా.. పికిల్స్ పాప మెనూ కు బిగ్ బాస్ షాకే..!
రీతూపై పర్సనల్ అటాక్
ఇవాళ్టి లైవ్ ఎపిసోడ్‌లో చూస్తే.. ఈమె ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే.. ఆమె మళ్లీ టీవీలో కనిపిస్తే అసలు ఆ ఛానలే పెట్టకూడదు అన్నంత అసహ్యంగా ప్రవర్తించింది మాధురి. ఆమె అరుపులు, ఎక్స్ ప్రెషన్స్, హేళనలు చూస్తుంటే.. చూసేవాళ్లకి పిచ్చి లేస్తుంది.. అక్కడ హౌస్‌లో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నైట్ లైట్స్ ఆర్పిన తరువాత బెడ్ రూంలో ఎవరూ మాట్లాడటానికి వీళ్లేదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే.. బయటకు వెళ్లి మాట్లాడుకోండి అంటూ రూల్స్ పెట్టింది మాధురి. అదేంటి అది బిగ్ బాస్ రూల్‌నా అని రీతూ చౌదరి అడగడంతో.. ‘ఏంటి తిరగేస్తున్నావ్.. బిగ్ బాస్ రూల్సా ఏంటి? ఇది నా రూల్.. అంటూ నోరేసుకుని పడిపోయింది. పాపం రీతూ చౌదరి.. ఆ రాముపై అయితే అన్యాయంగా నోరేసుకుని పడిపోయేది కానీ.. అక్కడ బర్రె నోరేసుకుని మాధురి మీద పడిపోవడంతో.. ‘అయ్యో మాధురి గారూ.. మాధురిగారూ’ అనే మాట్లాడింది. బిగ్ బాస్ రూలా? ఏంటి? నేను చెప్తే ఎదురు చెప్తావ్ ఏంటి? బెడ్ రూంలోమాట్లాడితే నేను ఒప్పుకోను.. మాట్లాడటానికి వీళ్లేదు.. ఇది నా రూల్ అని అన్నది మాధురి. మీరు రూల్స్ పెట్టడం ఏంటి? అసలు ఎందుకు అరుస్తున్నారు? అని రీతూ అనడంతో.. ‘నా హెల్త్.. నా హెల్త్ ఇదీ.. అంటూ సోఫాలో నుంచి లేచి చిందులు తొక్కింది మాధురి. నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు అని రీతూ అనడంతో.. ‘అలగలగే.. మీలా ఇష్టం వచ్చినట్టు ఎవరూ బిహేవ్ చేయడం లేదు’.. అంటూ పర్సనల్ ఎటాక్ చేసింది మాధురి.
Read Also: Bigg Boss Divvala: దువ్వాడ నువ్వు దేవుడివయ్యా.. ఆమెను ఎలా భరిస్తున్నావురా సామి..!
రూల్స్ నావే..
బిగ్ బాస్ రూలా అని నన్ను క్వచ్ఛన్ చేస్తారేంటి? ఇది నా రూల్ అని చెప్తున్నాను కదా అంటూ.. దివ్వెల మాధురి అరిచింది చూడూ.. అస్సలు తగ్గలేదు. అయితే రీతూ కూడా తగ్గలేదు.. మీకు ప్రాబ్లమ్ అయితే మీరెళ్లి బయటపడుకోండి అని కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ గొడవలో మాధురిని చూస్తే మాత్రం వామ్మో ఇలాంటి వ్యక్తిని ఇంకెప్పుడూ చూడలేదని ఆడియన్స్ తలలు బాదుకున్నారు. మాధురి హౌస్‌లో వాళ్లని ఇంత టార్చర్ చేస్తున్నా కూడా.. కంటెంట్ వస్తుందని ఆ బిగ్ బాస్ తమాషా చూస్తున్నాడు కానీ.. ఒక్కసారి కూడా ఆమెను హెచ్చరించినది లేదు. తనకు తానే రూల్స్ పెట్టేసుకుంది. ఆమె కనిపించిన ప్రతిసారీ.. గొడవలు, ఎదుటివాళ్లను తిట్టడం.. వాళ్ల గురించి చెడ్డగా మాట్లాడటం.. ఇప్పటివరకు దివ్వెలలో ఒక్క పాజిటివ్ కూడా కన్పించలేదంటే షాక్ అవ్వాల్సిందే.


