Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరో వారం పూర్తికావస్తుంది. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఇటీవల మరో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం పాత హౌస్ మేట్స్, కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ లోని కంటెస్టెంట్స్ తమదైన స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. గేమ్స్, టాస్కుల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. దీంతో ఈసారి టాప్-5లో ఎవరుంటారు? టాప్-3 కంటెస్టెంట్స్ ఎవరు?చివరకు విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే చాలా మంది ఒక కంటెస్టెంట్ పేరును ప్రముఖంగా సూచిస్తున్నారు. అతనే బిగ్ బాస్ విజేత కావచ్చని అందరూ చెబుతున్నారు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? దానికి సంబంధించిన వివరాలు చూద్దాం.
కంటెస్టెంట్లపై ట్రోల్స్..
ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిపైనా చాలా నెగెటివిటీ ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఒక కంటెస్టెంట్ పై మాత్రం అసలు నెగెటివిటీ కనిపించడం లేదు. టాస్కులు, గేమ్స్ లో ప్రదర్శనను పక్కన పెడితే అతని మాట, ఆట తీరు చాలా ముచ్చటేస్తోందని చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. చివరకు ఇటీవలే హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా ఈ పాత కంటెస్టెంట్ పై ప్రశంసలు కురిపించారు. చాలా మంది తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గా అతనిపై ప్రశంసల కురిపించారు. అతను మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్.
బిగ్ బాస్ లో దూసుకుపోతున్న ఇమ్మూ
పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, పంచులు , ప్రాసలు.. ఇలా బిగ్ బాస్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇమ్మాన్యుయేల్. చాలామంది కంటెస్టెంట్స్ వింత వింతగా ప్రవర్తిస్తుంటే మాత్రం ఇమ్మూ మాత్రం ఎలాంటి దాపరికాలు లేకుండా న్యాచురల్ గా కనిపిస్తున్నాడు. తోటి కంటెస్టెంట్స్ తోనూ ఎంతో కలివిడిగా ఉంటున్నాడు. గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయేల్ కేవలం రూ.500తో తాను సిటీకి వచ్చి ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్మూ ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ జీవితమే మారిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ షోలోనూ అదరగొడుతున్నాడు.


