Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Haritha Harish Elimination: అబ్బ సాయిరాం.. గుండు అంకుల్ ఎలిమినేషన్ కు గీతూకు సంబంధం ఏంటో!

Haritha Harish Elimination: అబ్బ సాయిరాం.. గుండు అంకుల్ ఎలిమినేషన్ కు గీతూకు సంబంధం ఏంటో!

Haritha Harish Elimination: బిగ్ బాస్ హౌస్ నుంచి హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడంటూ లీకులు అందుతున్నాయి. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ సంబరాలు చేసుకుంది. ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హ హ హ.. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే ఇదే మరి. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యిందంటే టీవీలకు హారతి పట్టడం.. సంబరాలు చేసుకోవడం చూశారా.. అది బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ రాయల్ ఎలిమినేట్ అయినప్పుడు చూశాం. ఎలిమినేట్ అయ్యానని ఆమె స్టేజ్‌పై బొక్కబోర్లా పడి.. దొర్లి దొర్లి ఏడుస్తుంటే.. దరిద్రం పోయిందని టీవీలకు హారతి పట్టి సంబరాలు చేసుకున్నారు ఆడియన్స్. అలాంటి గీతూ రాయల్.. ఇప్పుడు హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడని ఆనందంతో ఉప్పొంగిపోతుంది.

- Advertisement -

హరీష్ గురించి దారుణమైన కామెంట్స్

ఎలిమినేషన్ అప్డేట్‌కి సంబంధించిన వీడియోను వదిలిన గీతూ.. అందులో హరీష్ గురించి చాలా దారుణంగా మాట్లాడింది. ఆమె మాట్లాడిన తీరు.. ఆ హావభావాలు హరిత హరీష్ చూస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో కానీ.. సగటు ప్రేక్షకుడికి కూడా ఒళ్లు మండేట్టుగానే ఉంది. ‘అబ్బా సాయిరాం.. చూడు విభూది కూడా పెట్టుకుని వచ్చా దేవుడుకి మొక్కుకుని అబ్బా సాయిరాం చాలా హ్యాపీ.. హిహిహి. చిన్న గుండు (మర్యాద మనీష్) పోయింది. ఈరోజు పెద్ద గుండు పోయిందీ. దట్ లత్కోర్ పంచాయితీలు.. ఇంకా చాలా వర్డ్స్ యూజ్ చేశాడు. అంత నోటి దూల, లత్కోర్ పంచాయితీలు పెట్టే హరిత హరీష్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు. చాలా రోజులుగా ఆయన పోవాలీ.. పోవాలీ అని అనుకుంటున్నాడు. రెండోవారం నుంచి తను గేమ్‌ని గివ్ అప్ చేస్తున్నాడు. మిగతా వాళ్లు గేమ్ ఆడాలని చాలా ఆతృతగా గేమ్ ఆడుతుంటే ఇతను మాత్రం ప్రతి గేమ్‌ని గివ్ అప్ చేస్తున్నాడు.. అంటూ దారుణంగా మాట్లాడింది

Read Also: Bigg Boss New Promo: సిగ్గులేదా నోటి దగ్గరది లాక్కోవడానికీ.. గొడవులు బాగా ముదిరాయి.. మాట్లాడ్సింది శానా ఉందన్న నాగ్

ఒకసారి కాలు నొప్పి.. ఒకసారి చేయి నొప్పి..

అంతేకాక, హరీష్ ను ఎగతాళి చేస్తూ మాట్లాడింది. ఒకసారి కాలు నొప్పి అంటాడు.. ఇంకోసారి చేయి నొప్పి అంటాడు.. వేలు తిగిందంటాడూ.. తల తెగిందంటాడూ.. జుట్టు తెగిందంటాడూ.. ఏదేదో చెప్పేసి తప్పించుకుంటూనే ఉంటాడు. ఎవరైనా నామినేషన్ చేస్తే తినకుండా నిరాహార దీక్ష చేస్తాడు. నాగ్ మామ ఏదైనా చెప్పారంటే.. ఆ వారం అంతా అలిగి కూర్చొంటాడు. ఆయన గురించి ప్రతి ఒక్కరూ స్టాండ్ తీసుకోవాలని అనుకుంటారు. నిజానికి హరిత హరీష్ మంచోడే. ముక్కుసూటి మనిషే. కానీ.. ఆయన మాట్లాడే విధానం మిరపకాయ పెట్టినట్టుగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూస్తేనే చిరాకు అనిపిస్తుంది. నాటీనెస్‌కి శాడిజానికి తేడా తెలుసుకోండి అని సంజనాకి చెప్తున్నాడు ఈయన. కరెక్టే భయ్యా.. నిజంగానే శాడిజం చేస్తుంది. ఇవన్నీ కరెక్టే.. అంటూ చెప్పుకొచ్చింది.

నేనొక్కడ్నే సత్యహరిశ్చంద్రుడ్ని..

కానీ ఈయన్ని ఏదైనా అంటే.. నేనొక్కడ్నే సత్యహరిశ్చంద్రుడ్ని మిగతా వాళ్లంతా వేస్ట్. నేను మోనార్క్‌ని. నన్నెవరూ మోసం చేయలేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడని గీతూ ఫైర్ అయ్యింది. అతన్ని ఎవరూ ఏమీ అనుకూడదు. అతనితో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు. చివరికి ఆయన వంట చేసినా తినడానికి భయపడుతున్నారు. వంట చేస్తారు.. కానీ చేశా చేశా అని పదే పదే చెప్తాడు. నా వేలు తెగినా చేశా.. జుట్టు తెగినా చేశా.. గుండు మీద టోపీ పెట్టుకుని చేశా అంటాడు. పదే పదే నేను మనస్పూర్తిగా చేశా.. చేశా అంటే యాడ మనస్పూర్తి. చూసేవాళ్లకి అక్కడ తినేవళ్లకి మనశ్శాంతి లేకుండా పోతుందని.. చులకనగా మాట్లాడింది. సెకండ్ వీక్‌లోనే బిగ్ బాస్‌కి దమ్ము ఉందా? నన్ను బయటకు పంపించేయండి.. ఐ యామ్ పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ.. బిగ్ బాస్‌కే బాస్‌ని.. నేనొక్కడ్నే కరెక్ట్ అని చెప్తుంటాడు. ఇవన్నీ జనాలకి నచ్చలేదు. గేమ్‌లు ఆడకుండా.. మూలన మసాలా దోసె మూతి వేసుకుని కూర్చుంటానంటే అవ్వదు. నేను ఆడితే గేమ్.. మీరు ఆడితే క్రైమ్ అని మూతి ఇలా పెట్టడం. అందరికీ ఎక్కించడం.. నారదుడిలా గొడవలు పెట్టడం.. ఇవన్నీ సోదిపంచాయితీలు.. సుత్తి పంచాయితీలు. జనాలకు చిరాకు వచ్చేస్తుంది అందుకే బయటకు పంపేశారు’ అంటూ హరిత హరీష్ ఎలిమినేషన్‌పై దారుణమైన వీడియో చేసింది గీతూ రాయల్.

Read Also: Bigg Boss Elimination: ఇది అన్యాయం బిగ్ బాస్.. ఏంటి ఈ షాకింగ్ ఎలిమినేషన్?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad