Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లో హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ నిలిచింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో శ్రష్టి వర్మతో పాటు రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా, ఇమాన్యుయేల్, ఫ్లోరా శైనీ, తనూజ గౌడ ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రష్టి వర్మకే పడటంతో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్‌లో ఉన్న ఎనిమిది మందిలో మొదటిరోజు నుంచి ఓటింగ్‌లో శ్రష్టి వర్మతో పాటు ఫ్లోరా శైనీ డేంజర్ జోన్‌లో ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు శ్రష్టి వర్మను దురదృష్టం వెంటాడింది.
సుమన్ శెట్టికి హయ్యెస్ట్ ఓట్లు…
ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఉన్న వారిలో సుమన్ శెట్టి, తనూజలకు అత్యధిక ఓట్లు పడ్డాయి. శ్రష్టి వర్మ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని హౌజ్‌లో అడుగుపెట్టిన మొదటిరోజు బిగ్‌బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు తలక్రిందులు చేస్తూ సరిగ్గా వారం రోజులకే శ్రష్టి వర్మ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
Also Read- Bigg Boss: టాస్క్ లో సత్తా చాటిన భరణి..దెబ్బకి ఓనర్ అయ్యి కూర్చున్నాడుగా..!
వారు జెన్యూన్…
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకు వచ్చిన శ్రష్టి వర్మను హౌజ్‌లో జెన్యూన్‌గా ఉన్న నలుగురి పేర్లు చెప్పమని నాగార్జున అడిగాడు. రాము రాథోడ్, మనీష్, హరీష్, ఫ్లోరా శైనీ పేర్లు చెప్పింది శ్రష్టి వర్మ. కెమెరా ముందు యాక్ట్ చేసే వారు ఎవరు అని అడిగిన ప్రశ్నకు రీతూ చౌదరి, తనూజ, భరణి అంటూ పేర్కొన్నది.
రెండు లక్షలు మాత్రమే…
బిగ్‌బాస్‌లో వారం రోజులే ఉండటంతో రెమ్యూనరేషన్ పరంగా శ్రష్టి వర్మకు పెద్దగా లాభం చేకూరలేదు. వారం రోజులకుగాను కేవలం రెండు లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ దక్కినట్లు చెబుతున్నారు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన సెలిబ్రిటీలు అందరిలో శ్రష్టి వర్మ రెమ్యూనరేషన్ తక్కువని టాక్. జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణల కేసు కారణంగా శ్రష్టి వర్మ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
Also Read- Bigg Boss New Promo: సండే ఎపిసోడ్ లో మిరాయ్ టీమ్ సందడి.. నన్ను లోపలికి పంపించేయండన్న తేజా సజ్జ
కాగా బిగ్‌బాస్ సీజన్ 9లో తొమ్మిది మంది సెలిబ్రిటీలు, ఆరుగురు కామన్ మ్యాన్స్‌తో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. సెలిబ్రిటీలలో ఫ్లోరా శైనీ, సంజనా గల్రానీ, ఇమాన్యుయేల్, భరణి, సుమన్ శెట్టి, తనూజ గౌడ, రాము రాథోడ్, రీతూ చౌదరితో పాటు శ్రష్టి వర్మ ఉండగా.. కామన్ మ్యాన్స్ నుంచి శ్రీజ, మర్యాద మనీష్, హరీష్, ప్రియా, సోల్జర్ కళ్యాణ్, డిమోన్ పవన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.


