Sunday, July 7, 2024
Homeట్రేడింగ్Online Mobile Game: ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టిన యువకుడు.. షాక్‌లో కుటుంబం

Online Mobile Game: ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టిన యువకుడు.. షాక్‌లో కుటుంబం

Online Mobile Game: ‘ఆన్‌లైన్ గేమ్స్’ వ్యసనం లాంటివి. వాటి మాయలో పడి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. అయినా కొందరు మారడం లేదు. తాజాగా ఆన్‌లైన్ గేమ్ ఆడి ఒక యువకుడు రూ.95 లక్షలు పోగొట్టాడు. ఈ విషయం తెలిసి ఆ కుటుంబం షాక్‌కు గురైంది. తెలంగాణ, రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం సీతా రాంపూర్‌కు చెందిన ఒక యువకుడు డిగ్రీ చదువుతున్నాడు.

- Advertisement -

ఆ యువకుడికి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం ఇష్టం. ఇటీవల మొబైల్‌లో ‘కింగ్ 527’ అనే ఆన్‌లైన్ గేమ్‌ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. రోజూ ఆడేవాడు. అయితే, ఈ గేమ్ ఆడాలంటే డబ్బులు చెల్లించాలి. దీనికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. దీంతో ఆ యువకుడు తన తండ్రికి చెందిన బ్యాంక్ అకౌంట్ లింక్ చేశాడు. ఆ అకౌంట్‌లో రూ.95 లక్షలు ఉండేవి. అయితే, ఆ యువకుడు గేమ్ ఆడుతూ తండ్రి అకౌంట్‌లో ఉన్న రూ.95 లక్షలు మొత్తం పోగొట్టుకున్నాడు. తీరా డబ్బంతా పోయాక తండ్రికి విషయం తెలిసింది. అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం పోవడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. వాళ్లది సాధారణ రైతు కుటుంబం.

ఇటీవల ప్రభుత్వం వాళ్ల భూమి సేకరించి, పరిహారం కింద ఆ డబ్బు అందజేసింది. ఈ డబ్బును యువకుడి తండ్రి బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. అయితే, తండ్రికి తెలియకుండా ఆ బ్యాంక్ అకౌంట్‌ను తన గేమ్ అకౌంట్‌కు లింక్ చేశాడు ఆ యువకుడు. దీంతో అకౌంట్లో ఉన్న డబ్బంతా పోయింది. అటు భూమి కోల్పోయి, ఇటు భూమికి పరిహారంగా వచ్చిన డబ్బులు కోల్పోయిన ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతం. డబ్బంతా పోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆయన తీవ్ర వేదన చెందుతున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News