జుబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్స్ 36 వ వార్షికోత్సవ వేడుకలను ఆసుపత్రి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డితో పాటు వైస్ చెయిర్ పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- Advertisement -
అపోలో హాస్పిటల్స్ 36 సంవత్సరాల ప్రయాణాన్ని వర్ణిస్తూ, చిన్నారులు ప్రదర్శించిన స్కిట్ కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది , పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనివిందు చేసాయి.
ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీఈవో తేజస్వీరావు, సీఓఓ హర కరన్ తో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.