చందానగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిబిజె గోల్డ్ & డైమండ్స్ పారంభోత్సవం చందానగర్ ని ముంచెత్తిన జన సందోహంతో ఘనంగా జరిగింది. ప్రముఖ సినీ తార కుమారి నిధి అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించబడింది.
సంతోషంగా ఉంది..
సినీనటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ చదనగర్ లో గోల్డ్ & డైమండ్స్ తో పాటు శుభశ్రీ సిల్క్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమని, ఇక్కడ లభించే సరికొత్త డిజైన్లూ – వెరైటీలూ శారీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని వేరెక్కడా లభించవని, ఇక మొదటిగా తామే షాపింగ్ చేయాలని వచ్చిన కస్టమర్ల ఆనందానికైతే హద్దేలేకుండా పోయింది.
నంబర్ 1 షోరూంగా..
షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ సిబిజె గోల్డ్ & డైమండ్స్, శుభశ్రీ సిల్క్ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అందిస్తుందని, ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే బంగారు ఆభరణాలు ఎంపిక చేయడంలోగానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామనడంలో తమకు అపారమైన నమ్మకంమందని తెలియజేసారు.
మజూరీ లేకుండా..
ప్రారంభోత్సవ ఆఫర్ తో పాటు దసరా దీపావళి వేడుకల సందర్భంగా బంగారు ఆభరణాలపై మజూరీ లేదు, తరుగులో 26% తగ్గింపు, డైమండ్ క్యారెట్ పై రూ.10,000తగ్గింపు, సిల్వర్ ఆర్టికల్స్ పై మజూరీ, తరుగు లేదని, ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొమ్మని అన్నారు.