Friday, November 22, 2024
Homeట్రేడింగ్CM Revanth in ISB leadership summit: ఐ.ఎస్.బి. లీడర్ షిప్ సమ్మిట్ లో...

CM Revanth in ISB leadership summit: ఐ.ఎస్.బి. లీడర్ షిప్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి

ధైర్యం-త్యాగం..

లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి ISB ప్రాంగణంలో మొక్క నాటిన సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లో లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.

- Advertisement -

ISB లీడర్‌షిప్ సమ్మిట్‌లో మీ అందరిని కలిసినందుకు సంతోషంగా ఉంది..

ఐఎస్ బీ ఈ యేడాది ఎంచుకున్న లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా థీమ్ పైన
నా ఆలోచనలను మీతో పంచుకుంటాను.

ఐఎస్ బిలో చదువుకుంటున్న మీరంతా యువకులు, తెలివైనవారు, అసాధారణ విద్యార్థులు

నా జీవితం, రాజకీయాల నుంచి నేను నాయకత్వం గురించి నేర్చుకున్నాను..

కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉంది.

మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి వి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణ..

ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం.

తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరం.

గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేం

గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చు.

దేశంలోని గొప్ప నాయకులు, మన కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు.

మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా ధైర్యం , త్యాగం అనే రెండు విలువల గురించి ఆలోచించండి..

మీకు ధైర్యం ఉంటే, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు విజయం సాధిస్తారు.

ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలి.

పేదలు, ధనికులు ,చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తు స్నేహ భావంతో అందరిని కలుపుకుపోవాలి…

ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరు..

ISB విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణ తో పాటు న్యూ ఇండియా కు బ్రాండ్ అంబాసిడర్‌లు.

తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జిడిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మాలక్ష్యం

ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలి.

తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాలి..

మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు , సామాన్య ప్రజలతో తెలంగాణ ,హైదరాబాద్ గురించి మాట్లాడండి.

భారతదేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని నేను కోరుకోవడం లేదు.

న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో , సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని కోరుకుంటున్నాను.

ప్రపంచంలోనే భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యం. కాని అసాధ్యం కాదు.

మా ప్రభుత్వంతో మీరు రెండు మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను .మీకు పెద్ద జీతాలు ఇవ్వలేకపోయినా మంచి అవకాశాలు, పెద్ద సవాళ్ళను ఇస్తా.

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం..

గచ్చిబౌలి లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం…

నేను సౌత్ కొరియా లో స్పోర్ట్స్
యూనివర్సిటీ ని సందర్శించాను..

సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్ లో అనేక పథకాలు సాధించింది..

మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పథకం కూడా సాధించలేకపోయింది..

నా లక్ష్యం ఒలింపిక్స్ మనం పథకాలు సాధించడం..

హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News