‘కోలాచప్’ అంటే కెచప్ అంతే. కాకపోతే ఇది పెప్సీ వాళ్లు తెచ్చిన సరికొత్త ప్రాడక్ట్. అయితే ఈ ప్రాడక్ట్ పై నెటిజన్స్ పెప్సీ కంపెనీని ఆటాడుకుంటున్నారు. ఈ కెచప్ సాఫ్ట్ డ్రింక్ ఫ్లేవర్ లో ఉంటుంది. క్లాసికల్ కోలా, ట్యాంగీ కెచప్ ల మైండ్ బ్లోయింగ్ ఫ్యూజన్ అంటూ పెప్సీ తెగ యాడ్స్ ఇస్తున్నా ఇది ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేయట్లేదు. అంతేనా తన అఫిషియల్ ఇన్స్టా అకౌంట్లో పెప్సీ ఇంకా ఇంకా చాలానే ఈ కొత్త ప్రాడక్ట్ గురించి రాసుకొచ్చింది. స్వీట్, సాల్టీ, డెలిషియస్ అంటూ ఏమేమో అడ్జెక్టివ్స్ ప్రయోగించినా ఈ కెచప్ సారీ ఈ కోలాచప్ ‘దరిద్రంగా ఉంద’నే కామెంట్స్ పీక్స్ కు వెళ్లిపోయాయి. ఓ నెటిజన్ ఏకంగా ‘ఇంత పాపిష్టి పని చేస్తారట్రా’ అని పెప్సీని ఆటాడేసుకున్నాడు.
‘గుడ్ అండ్ బ్యాడ్ ఒకేసారి చెప్పినట్టుంద’ని మరో నెటిజన్ ట్వీటేశాడు. అంటే పెప్సీ టేస్ట్ గుడ్ కానీ కోలాచప్ బ్యాడ్ న్యూస్ అని కుండబద్ధలుకొట్టేశాడు. మరొకరైతే .. ‘ఏంటీ ఏప్రిల్ ఫూల్ ఎగైన్’ అంటూ చురకలు పెట్టారు. ఇక మరికొందరు తమ క్రియేటివిటీని చూపిస్తూ ‘పెప్చప్’ అని పెప్సీకి చెంప దెబ్బ కొట్టేశారు.