ఇండియాలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ ప్రాపర్టీ షో హైటెక్స్‌లో ప్రారంభమైంది.
200 మందికి పైగా ఎగ్జిబిటర్లు
ఆగస్ట్ 2వ తేదీ నుండి 4 వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రెడాయ్ ప్రాపర్టీ షో గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉండనుంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ఫ్లాట్‌లు, అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య సముదాయాల వంటి సుమారు 800 కంటే ఎక్కువ ప్రాజెక్టుల వివరాలు అందుబాటులో ఉంటాయి. గృహ కొనుగోలుదారులకు రుణాలు అందించేందుకు కొన్ని ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఐజిబిసి నేషనల్ ఛైర్మన్ సి శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి. రామ్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్ ఈసీ మెంబర్ సిహెచ్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ ఎన్ జైదీప్‌రెడ్డి, సెక్రటరీ బి. జగన్నాథరావుతో పాటు ఇతర క్రెడాయ్ నాయకులు, సభ్యులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, ఐపిసిలు తదితరులు పాల్గొన్నారు.