రుచిగా, వెరైటీగా ఉండే బేకరీ ఫుడ్స్ కు కేరాఫ్ గా వెలుగుతున్న హైదరాబాద్ లో దిల్పసంద్ ను చాలా ఇష్టంగా తినేవారికి లెక్కేలేదు. అంతెందుకు హైదరాబాద్ నుంచి వేరే ఊళ్లకు వెళ్లేవాళ్లు చాలా మంది హైదరాబాద్ దిల్పసంద్ ను కూడా తమతో తీసుకెళ్తుంటారు. అలాంటి దిల్పసంద్ లు పసందుగా దొరికే అతి పెద్ద అడ్రస్ అంటే ఆల్ఫా హోటల్.
క్రంచీ-టేస్టీ..
క్రంచీ, స్వీట్ గా ఉండే ఆల్ఫా హోటల్ దిల్పసంద్ లు కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్, చక్కెరతో యమ్మీగా తయారు చేస్తారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దిల్పసంద్ ఒక్కసారి తింటే మీరిక లైఫ్ లో మర్చిపోవటం అసాధ్యం. అంత పొరలుపొరలుగా, టేస్టీగా, ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడి దిల్పసంద్ లు. అందుకే పిల్లా, పెద్దా అందరికీ ఇక్కడి దిల్పసంద్ లు చాలా ఇష్టం.
1957 నుంచి..
ఆల్ఫా హోటల్స్ లో ఈ క్లాసిక్ డెజర్ట్ వారసత్వంగా వస్తూ ఉంది. 1957 నుండి హైదరాబాద్‌లోని వైబ్రెంట్ ఫుడ్ సీన్‌లో ప్రధానమైన ఇక్కడి దిల్పసంద్ లు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు మళ్లీ తిని చూడండి.
తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకూ..
తెల్లవారుజామున 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీ నుంచి వచ్చిపోయే వారందరికీ తన కమ్మని రుచులను వండి వడ్డించే ఆల్ఫా హోటల్ అంటే ఒక్కసారి హైదరాబాద్ కు రైల్లో వచ్చిన వాళ్లందరికీ తప్పకుండా తెలిసే ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిపోయే వారందరికీ తల్లో నాలుక ఈ ఆల్ఫా హోటల్. ఇది హైదరాబాద్ చరిత్రలో భాగమైంది.
మరింత సమాచారం కోసం:
ఆల్ఫా హోటల్, రైల్వే స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్.
ఫోన్ నంబర్ : 040 – 66495583
సమయం – ఉదయం 5 నుండి అర్ధరాత్రి 12 వరకు.