Tuesday, February 27, 2024
Homeట్రేడింగ్Happiness with investments: మానసిక ఆనందం కోసం పెట్టుబడులు

Happiness with investments: మానసిక ఆనందం కోసం పెట్టుబడులు

సేఫ్టీ ఫీల్ అయ్యే మనసు ఎప్పుడూ ఖుషీగా ఉంటుంది

చిరాగ్గా ఎక్కువైందా?  మీ మనసు బాలేదా? మీకు కోపం ఎక్కువగా వస్తోందా? బీపీ కూడా ఎలివేటెడ్ గా ఉంటోందా?. ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ లేదా?  దేనిపైనా ఫోకస్ పెట్టలేకపోతున్నారా?  ఇదేం లైఫ్ రా బాబోయ్ పారిపోవాలనిపిస్తోందా?  కానీ ఎక్కడికి పారిపోతారు? ఎవరి నుంచి మీరు పారిపోతారు? మీ నుంచి మీరు పారిపోతే..ఎక్కడికి పోయినా ఇలాంటి లైఫే ఉంటుందిగా?  దీనర్థం.. మీరు మానసిక ఆనందానికి దూరమయ్యారని.  ఆ లోతుపాతులు ఏవో తెలుసుకుంటే సరికదా?

- Advertisement -

 మీ మనసును తేలికపరిచేలా మిమ్మల్ని మీరు ఆనందపరచుకోవాలి.  మానసిక ఆనందం సొంతమయ్యే వరకూ మీకు ప్రశాంతత ఉండదండీబాబు,  అర్థం చేసుకోండి.

మనిషికి భద్రత అవసరం..ఆ భద్రత ఉంటే ఇంకేం కావాలి.  సేఫ్టీ ఫీల్ అయ్యే మనసు ఎప్పుడూ ఖుషీగా ఉంటుంది.  మనసు ప్రశాంతంగా ఉంటుంది.  అప్పుడు ఆటోమేటిక్ గా మానసిక ఆనందం వస్తుందంటే మీరు ఒప్పుకుంటారు కదా. అంతా బానే ఉంది కానీ మరి ఈ భద్రత ఎలా వస్తుందనేగా మీ నెక్ట్స్ డౌట్.   మన భద్రత అనేది చాలా ఫార్మ్స్ లో ఉంటుంది.   ఫర్ ఎగ్జాంపుల్.. ఫిజికల్ గా సేఫ్టీ, మనల్ని ఎవరూ అటాక్ చేయరు, మనం సేఫ్ గా ఉన్నామనేది ఒకటి.  ఇంకోటి.. హెల్త్ పరంగా సేఫ్ గా ఉన్నామనే మరో భద్రత.  ఇదిచ్చే భరోసా ఇంకా గొప్పది.  ఇంకొకటి ఇదికూడా మనందరికీ తెలిసినదే.  అదేనండీ.. ఆర్థిక భద్రత.  అవును.. ఇదింకా ఇంపార్టెంట్ థింగ్ అంటారేమో.  నిజమే ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ గా ఉండటం అనేది మరీ ప్రయారిటీ. 

హైపర్ టెన్షన్ కు ఫుల్ స్టాప్ ఇలా

మీరు చూసే ఉంటారు కొంతమంది నెలాఖరు వచ్చేసరికి హైపర్ టెన్షన్ లో పడిపోతారు. అబ్బా నెలలో లాస్ట్ వీక్.. చేతిలో డబ్బు లేదు.. ఖర్చులకు పైసా లేదు.. లైఫ్ ఏమవుతుందో.. చాలా బిల్లులు, ఫీజులు కట్టాలి..ఈనెల చాలా ఖర్చులున్నాయని.. అయిబత్ అయిబత్ అయిపోతుంటారు.  కానీ.. కొత్త నెల స్టార్ట్ కాగానే.. శ్యాలరీ చేతికి రాగానే.. వీళ్లు మళ్లీ.. కాస్త నార్మల్సీకి దగ్గరగా వస్తారు.  అంటే.. డబ్బు లేదనే భయం వీరిని వెంబడిస్తుంటుంది.

యూజవల్ గా మిడిల్ క్లాస్ వాళ్లకున్న ఓ మానసిక సమస్యే ఈ ఫైనాన్షియల్ సేఫ్టీ.  ఇంకొందరు ఉంటారండీ హమ్మయ్య చేతిలో కాస్త బ్యాలెన్స్ ఉంది, ఈనెల ఖర్చులు పెద్దగా ఇంకేం లేవు, అన్నీ పేమెంట్స్ పూర్తయ్యాయి, ఇంకా బ్యాంకులో కాస్త డబ్బుంది, సో.. థాంక్ గాడ్ ఈనెల ఇక కేక్ వాగే అని ప్రశాంతంగా ఊపిరి తీసుకోవటం చాలామంది మధ్యతరగతి వాళ్లకు రొటీన్.  చేతిలో చిల్లిగవ్వ లేకపోతే పడే నరక యాతన.. కాస్త డబ్బుంటే ఆ డబ్బు ఖర్చు పెట్టినా-పెట్టకపోయినా..అదిచ్చే భరోసా-భద్రత ఇంకేదీ ఇవ్వదు.  అదేమంటే.. మనీకి ఆల్టర్నేటివ్ లేదనే మాటలు వీళ్ల నోట్లో రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి.

కలలు కనండి

అందుకే.. మీరు ఆర్థిక భద్రత గురించి కలలు కనండి.  వాటిని అమలు చేయండి.  భద్రత మన శరీరానికి, మనసుకు ఇచ్చే శక్తి ఉన్నది డబ్బుకే అని అందరం అనుకుంటాం.  ఇది వాస్తవం.  అందుకే మీ చేతిలో ఉన్న డబ్బు అనవసరంగా ఖర్చు చేయకండి.  ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ సెక్యూరిటీ ఉన్నవారు.. స్పెండ్ థ్రిఫ్ట్ గా ఉండటాన్ని మానేయాలి.  ఇదే ఫస్ట్ స్టెప్.

పీనాసిగా ఉండమని ఎవరూ చెప్పరు కానీ.. అవసరాలకు మాత్రమే డబ్బును వాడండి.  అప్పుడు కాస్త డబ్బు ఇంకా మిగిలిందినే పాజిటివ్ వైబ్స్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.  పోస్ట్ పోన్ చేసుకోగలిగిన అవసరాలుంటే  ఫస్ట్ వాటిని పోస్ట్ పోనే చేసేసుకోండి.  ఇది మరింత రిలీఫ్ ఇచ్చే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్.  ఫర్ ఎగ్జాంపుల్.. పండగకు డ్రెస్ కొనాలి.  తప్పదు కొనాలని మీరు డిసైడ్ అయితే సరి కానీ ఎలాగూ కొత్తవి-మంచివి మీతో బట్టలున్నాయన్నప్పుడు ..ఇంకోసారి ఎప్పుడైనా కొత్తవి షాపింగ్ చేద్దాంలే అనుకుంటే మంచిది..ఈ ప్రెజెంట్ ఖర్చును వాయిదా వేసుకుంటే.. షాపింగ్ కు అయ్యే ఖర్చు మిగులుబాటైనట్టే.  అంటే మీ వాలెట్ లో ఇంకా డబ్బులున్నట్టే.  ఇది మీకు ఫైనాన్షియల్ సేఫ్టీ ఫీలింగ్ ఇవ్వగలిగితే చాలా మంచిది.

మరి పెట్టుబడి చేయరా?

ఇక నెక్ట్స్..పెట్టుబడి అంటే..కేవలం డబ్బే అకౌంట్లో దాచుకోవటమే కాదు.. అది మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కూడా.  అందుకే..కొందరికి ఎఫ్డీ, ఆర్డీలు చేసేదాని కంటే.. ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ శ్యాటిస్ఫాక్షన్ వస్తుంది.  అలాంటి మైండ్ సెట్ ఉన్నవారు..పెట్టుబడులుగా మీ చేతిలోని డబ్బును దాచుకోండి.  దీంతో.. మీకు బోనస్ లతో పాటు..ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి.  అది ఇంకా ఎక్కువ మానసిక ఆనందాన్ని ఇస్తుందంటే..అలాగే చేయండి. ఇందులో తప్పేం లేదు. 

ఇన్సూరెన్సులు, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ఈక్విటీస్, గోల్డ్ సేవింగ్స్, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు.. సిప్ లు..ఇవన్నీ మీకు ఆర్థిక భద్రత ఇచ్చేవే.  కాబట్టి మీరు మోస్ట్ డిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ లైఫ్ ను లీడ్ చేయటం కూడా సేఫ్టీ ఇచ్చే విషయమే.  ఇవన్నీ మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచి, మానసికంగా మరింత ఆనందంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.  ఇలాంటి వారు ఎప్పుడూ ఉత్సాహంగానే కనిపిస్తారు.

నాలెడ్జ్ పెంచుకుంటే..

అంతేకాదు.. ఇలాంటి ఇష్యూస్, సబ్జెక్ట్స్ పై నాలెడ్జ్ పెంచుకోవటం కూడా చాలామందికి హ్యాపినెస్ ను ఇస్తుంది.  మరి.. మీరు ఇన్వెస్ట్ మెంట్ ఎక్స్ పర్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ ఇంటర్వ్యూలు ఫాలో అవ్వండి.  ఇన్వెస్ట్ మెంట్ గురులను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.. వాళ్లిచ్చే టిప్స్ ను చదవండి.  ఇంకా లోతులు ఏమున్నా.. బిజినెస్ ఛానెల్స్ చూసి తెలుసుకోండి.. ఫైనాన్స్ వెబ్ సైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి.. సో..అప్డేట్ అవ్వండి..ఇలా చేస్తే కూడా కొందరికి మంచి హ్యాపినెస్ సొంతమవుతుంది.  తప్పకుండా ఇలాంటివి మీ రొటీన్ గా పెట్టుకోవచ్చు..

బోర్డం నుంచి బెయిలౌట్..

రెగ్యులర్ లైఫ్, రొటీన్ మరింత రొటీన్ గా బోర్ కొట్టించినప్పుడు..ఇలాంటి కన్స్ట్రక్టివ్ వేస్ లో.. మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువ డైవర్ట్ చేసుకోవచ్చు.  కానీ ఈ క్రమంలో.. మీరు డబ్బు మనిషిగా మాత్రం మారకండి.  అప్పుడు మీకు బంధాలు-బంధుత్వాలు ఏమీ మిగలవు..కేవలం డబ్బే మిగులుతుంది.. అందుకే..మితంగా డబ్బును ప్రేమించండి.. అవసరమైనంత..శక్తిమేర.. మీరు పొదుపు చేసుకోండి.  ఇవన్నీ .. బెస్ట్ వేస్ టు లివ్.  కానీ.. మానసిక ఆనందాన్ని ఇచ్చేంత వరకే మీరు వీటికి ప్రయారిటీ ఇవ్వాలి..కానీ ఇదంతా అత్యాశకు దారి తీయకుండా మిమ్మల్ని మీరే కంట్రోల్ లో ఉంచుకోవాలి.

గోల్డ్ సేవింగ్స్

గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఫేమస్.  మన ఇండియన్స్ కు.. గోల్డ్ అంతా శుభకరం..పైగా చాలా సెంటిమెంట్.. గోల్డ్ ఎక్కువగా ఉండటాన్ని ప్రాస్పెరిటీగా, సోషియల్ స్టేటస్ గా చూస్తారు.  గోల్డ్ కొంటే ఇంట్లో వాళ్లందరికీ చాలా ఆనందం ఇస్తుంది.  ఇది మంచి మెంటల్ సేఫ్టీ ఇస్తుంది.. హమ్మయ్య.. కొంచెం గోల్డ్ కొనగలిగాం అని పార్టీ చేసుకుంటారు కూడా.  గోల్డ్ అమ్ముకోవటం అంటే దివాలాకోరు తనానికి సింబల్..అదే గోల్డ్ కొంటే అది ప్రాస్పెరిటీ..ప్రాపర్టీ, అసెట్ అన్నమాట.  అందుకే.. మానసిక ఆనందం కోసం ఆడవాళ్లు.. కచ్ఛితంగా గోల్డ్ కొనటాన్ని ప్రయారిటీగా పెట్టుకుంటారు.  ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా గోల్డ్ కొనటం మన కల్చర్ గా మారింది అందుకే.  కొంతమంది అప్పు చేసి లేదా ఈఎంఐల్లో గోల్డ్ కొంటారు..అంత ఆనందం ఇస్తుంది మరి గోల్డ్. 

సేవింగ్స్ ఇచ్చే తృప్తి అనంతం..

మానసిక ఆనందానికి.. డబ్బుతో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందన్నది కాదనలేని సత్యం.  అందుకే మీరు సేవింగ్స్ ను అలవాటు చేసుకోండి.. ఖర్చులను కంట్రోల్ లో పెట్టుకోండి.. ఎ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఏ పెన్నీ ఎర్న్డ్ అనే సామెత ఊరికే రాలేదు..అంటే.. మీరు ఓ పైసా ఖర్చు పెట్టలేదంటే..ఓ పైసా సంపాదించినట్టేగా అర్థం.  ఇది మీరు బాగా గుర్తుంచుకోండి.. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే.. మీరు ప్రశాంతంగా ఉండచ్చు. పైగా.. అప్పులు, రుణ భారం లేకుండా.. నిశ్చింతగా లైఫ్ ఎంజాయ్ చేయచ్చు.  అప్పులు చేయటంతో మానసిక ఆనందం లేకుండా పోతుందన్న విషయం మీరంతా ఒప్పుకుంటారు కదా.

ఓన్లీ విండో షాపింగే దిక్కా?

షాపాలిక్స్ అంటే..షాపర్స్ ఎక్కువ ఆనందంగా ఉంటారు.  కొంతమందికి డబ్బు కూడబెట్టడంతో మానసిక ఆనందం వస్తుంది.. కానీ కొందరికి విచ్చలవిడిగా ఖర్చు చేయటంలోనే మానసిక ఆనందం వస్తుంది.  అదేమంటే.. డబ్బు పోగేసుకునేది ఖర్చు పెట్టి..హ్యాపినెస్ కొనటానికేగా అని వాదించేవారు మన మధ్య చాలామంది ఉన్నారు.  లెక్కాపత్రం లేకుండా షాపింగ్ చేసేవారు .. చాలా లైటర్ వేలో లైఫ్ ను తీసుకుంటారు.  సో.. మీరు షాపాలిక్స్ అయితే.. రెగ్యులర్ గా షాపింగ్ ఎంజాయ్ చేయండి. ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్, లేదా విండో షాపింగ్ కు ప్రయారిటీ ఇచ్చి, ఖర్చులకు కళ్లెం వేయండి.

ఫార్ములా అంటూ ఏం లేదు

మానసిక ఆనందం ఎవరికి ఎందులో వస్తుందన్న కచ్ఛితమైన ఫార్ములా ఏమీ ఉండదు.  ఎందుకంటే.. ఒక్కొక్కరికి ఒక్కో పనిలో ఆనందం వస్తుంది.  మీకు బాగా నచ్చే పని ఏముంటే అది చేయండి.. మానసికంగా ఆనందాన్ని ఆస్వాదించండి.  ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లటం అంటే ఇదే.  మిమ్మల్ని ఏ విషయం ఎక్కువ ఆనందపరిస్తే అదే మీ ఫేవరెట్ థింగ్ అని అర్థం.

మానసిక ఆనందం లేకపోతే ఏమవుతుంది? ఇది మనమంతా తెలుసుకోవాల్సిన విషయం.  మనల్ని ఏదో కొరత, వెలితి వెంటాడుతూ ఉంటుంది.  సంతోషం ఉండదు.. అసహనంగా, కోపంగా ఊగిపోతుంటాం.  ఇలా మానసిక సంతోషం లేని వారికి.. మానసిక రోగాలు వస్తాయి.  అంతేకాదు.. ఎక్కువ టెన్షన్స్.. హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్ వస్తాయి.  మరి మానసికంగా ఆనందంగా ఉంటే..ఇవన్నీ అదుపులో ఉంటాయి.. మీరు ఉల్లాసంగా ఉండాలంటే.. ఆరోగ్యంగా ఉండాలంటే..ఈమాత్రం మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవాలి మరి. అసంతృప్త జీవితం.. సంతోషం లేని బ్రతుకులతో అన్నీ టెన్షన్సే.  అందుకే.. మానసికంగా మీరు ఉచ్ఛ స్థితి అనుభవించాలంటే.. మీ మనసును సంతోషపెడుతూ.. నిండు మనసుతో .. ఉత్సాహంగా-ఆరోగ్యంగా ఉండాలన్నమాట. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News