Friday, December 20, 2024
Homeట్రేడింగ్Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎల్‌ఐసి స్టాల్

Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఎల్‌ఐసి స్టాల్

పాలసీలపై అవగాహన..

హైదరాబాద్ బుక్ ఫెయిర్, ఎన్టీఆర్ స్టేడియంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాల్‌ను జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక బుక్ ఫెయిర్‌లో ఎల్‌ఐసి అసోసియేట్ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ ఈ పుస్తక ప్రియుల స్వర్గధామానికి దేశం నలుమూలల నుండి ప్రచురణకర్తల భాగస్వామ్యం ఉందన్నారు.

- Advertisement -

లైఫ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ఎల్‌ఐసీ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. సందర్శకుల్లో కొందరు జోనల్ మేనేజర్‌తో సంభాషించి ఎల్‌ఐసి ఏజెంట్‌గా మారేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఉతుప్ జోసెఫ్, జి. మధుసూధన్, ప్రమోద కుమార్ సాహూ, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News