హైదరాబాద్‌లోని ప్రముఖ PGDM కాలేజ్ ICBM-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ (ICBM-SBE) 2022-24 బ్యాచ్ 17వ కాన్వొకేషన్ వేడుకలను విజయవంతంగా నిర్వహించింది. ICBM కళాశాల డైరెక్టర్ – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షంషుద్దీన్ జరార్ , తన స్వాగత ప్రసంగంతో వేడుకలను ప్రారంభించారు. ఆపై ప్రొఫెసర్ పి. నారాయణ్ రెడ్డి, డైరెక్టర్ జనరల్, తన ఉత్సాహభరితమైన ప్రసంగాన్ని ఇచ్చారు.
ముఖ్య అతిథి డా. టి.వి.రావు, ఛైర్మన్, TVRLS & Ex. ప్రొఫెసర్, IIM (A) గౌరవ అతిథులుగా శ్రీనివాస్ CR, CHRO & వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ పొటెన్షియల్ డెవలప్‌మెంట్ & అడ్మిన్, NACL ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెడ్ మోడీ, కంట్రీ హెడ్ & ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్, న్యూమార్క్, షాలిని కె, గ్లోబల్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ – డిజిటల్ ఇండస్ట్రీస్, APAC, సిమెన్స్ AG పాల్గొన్నారు.
చైర్పర్సన్ డాక్టర్ రీతు జరార్ మాట్లాడుతూ ICBM -SBE కళాశాల SAQ’s గుర్తింపు పొందిందని, AICTE ఆమోదించబడిందని చెప్పారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన విశిష్ట అతిథులకు, అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపిన అకాడమిక్స్ డీన్ డాక్టర్ జితేందర్ గోవిందని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగించారు.