Tuesday, January 14, 2025
Homeట్రేడింగ్IIMC: అటానమస్ స్టేటస్ సాధించిన ఐఐఎంసి కాలేజ్

IIMC: అటానమస్ స్టేటస్ సాధించిన ఐఐఎంసి కాలేజ్

యుజీసీ..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల అటానమస్ స్టేటస్ (స్వయం ప్రతిపత్తి) సాధించి 2025-26 విద్యా సంవత్సరం నుండి అకడమిక్ ఎక్సలెన్స్ లో కొత్త యుగంలోకి అడుగు పెట్టనుంది.

- Advertisement -

1973లో ప్రారంభమై
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ 1973 నుండి వాణిజ్య శాస్త్రం, మేనేజ్‌మెంట్ మరియు సైన్స్ రంగాలలో విద్యా వైభవానికి ప్రసిద్ధి చెందింది. కళాశాల 1973లో 100 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఇప్పుడు కళాశాల బలం 1700 మంది విద్యార్థులకు పెరిగింది. కళాశాల బి.కామ్.లో మూడు కోర్సులు (ఆనర్స్ ,కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్), బి.ఎస్సి.(డేటా సైన్స్), బి.బి.ఏ. కోర్సులను అందిస్తుంది. ఈ సంస్థ 2023లో 3వ సైకిల్‌లో 3.27 స్కోర్ సాధించి NAACచే “A+” గ్రేడ్‌చే తిరిగి గుర్తింపు పొందింది మరియు ISO ఎడ్యుకేషన్ సర్టిఫైడ్ కళాశాలగా కూడా గుర్తింపు పొందింది. కళాశాలలో పి.హెచ్ది., యూజీసీ నెట్,సెట్ అర్హతతో అనుభవవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది విధులను నిర్వహిస్తూ కళాశాలను విద్యారంగంలో విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్నారు.

10 ఏళ్ల పాటు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2025-26 విద్యా సంవత్సరం నుండి 10 సంవత్సరాల కాలానికి మా కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా ప్రదాన లేఖను అందించిందని, ఇంతటి విజయాన్ని సాధించినందుకు కళాశాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం, కళాశాల సెక్రటరీ చల్లా ప్రసన్నకుమార్, ఇతర యాజమాన్య సభ్యులు, ప్రిన్సిపల్ కూర రఘువీర్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, ఇతర శ్రేయోభిలాషులు ఆనందోత్సాహాలను వ్యక్తపరుస్తూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News