ప్రముఖ సినీనటి లావణ్య త్రిపాఠి కూకట్ పల్లిలో సందడి చేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కాంచీపురం నారాయణి సిల్క్స్ వస్త్ర పోరూమ్ ను ఆమె ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణి సిల్క్స్ డైరెక్టర్ సి.వి.ఎస్. అభినయ్ మాట్లాడుతూ.. పట్టుచీరలలో నాణ్యతకు, వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ 2013లో కాంచీపురం నారాయణి సిల్క్స్ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ ఇప్పుడు కూకట్ పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే తమ 11వ షోరూమ్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
మగువలు మెచ్చే సరికొత్త డిజైన్ చీరల కలెక్షన్స్ తమ షోరూమ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఏ డిజైన్ కు ఆ డిజైన్ ప్రత్యేకంగా… విభిన్న రంగుల్లో నాణ్యమైన పట్టుచీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సంప్రదాయ చీరలకు అధునాతన శైలిని మేళవించి, నాణ్యతను రంగరించిన పట్టుచీరల సముదాయంగా నారాయణి సిల్క్స్ మంచి గుర్తింపు పొందిందన్నారు. కంచిపట్టు, ధర్మవరం, ఆరణి, గద్వాల్, కోటా, పోచంపల్లి, మహేశ్వరి, కోయంబత్తూర్, బెనారస్, చందేరి వంటి అనేక రకాల సంప్రదాయ చీరలు ఇక్కడ లభిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణ సిల్క్స్ డైరెక్టర్లు ప్రసాదరావు, వెంకటేశ్వర్లు, రాజమౌళి, సుజాత తదితరులు పాల్గొన్నారు.