Friday, November 22, 2024
Homeట్రేడింగ్QAIG Q-CTRL new bondage: క్వాంటం ఏఐ గ్లోబల్, క్యు - కంట్రోల్

QAIG Q-CTRL new bondage: క్వాంటం ఏఐ గ్లోబల్, క్యు – కంట్రోల్

భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ

క్వాంటం కమ్యూనికేషన్ & టెక్నాలజీలో భారతదేశపు ప్రముఖ సంస్థ క్వాంటమ్ ఏఐ గ్లోబల్ (QAIG), మరియు క్వాంటం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్‌వేర్‌లో గ్లోబల్ లీడర్ అయిన క్యు – కంట్రోల్, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ మార్కెట్లలలో ఒకటైన భారతదేశంలో వివిధ సాంకేతిక కార్యక్రమాలపై పని చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

- Advertisement -

ఈ నెల ప్రారంభంలో, భారతదేశంలో క్వాంటం వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి క్యు – కంట్రోల్ ప్రకటించింది. సాంకేతిక విశ్వవిద్యాలయాలలో క్వాంటం కంప్యూటింగ్ విద్యను తప్పనిసరి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాంతంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. క్యు – కంట్రోల్ యొక్క అత్యాధునిక బ్లాక్ ఒపాల్ సాఫ్ట్‌వేర్‌ను తమిళనాడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TNSDC) నాన్ ముధల్వన్ అప్‌స్కిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ద్వారా ఇది సాధ్యమయింది. క్యు – కంట్రోల్ తో కొత్త భాగస్వామ్యం మొదటి దశలో, QAIG క్వాంటం టెక్నాలజీ లో దాని విస్తృత పరిజ్ఞానాన్ని, విద్యను వినియోగించుకుని TNSDC భారతదేశం అంతటా క్యు – కంట్రోల్ యొక్క బ్లాక్ ఒపాల్ ప్లాట్‌ఫారమ్‌కు మద్దతు, విస్తరణ భాగస్వామిగా పని చేస్తుంది.

2025 నాటికి క్వాంటం కంప్యూటింగ్‌లో సగానికి పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని మెకిన్‌సే నివేదిక అంచనా వేసినట్లుగా, ప్రపంచంలో క్వాంటం వర్క్‌ఫోర్స్ చాలా తక్కువగా ఉంది. క్వాంటం నైపుణ్యాల అంతరాన్ని పూడ్చేందుకు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుండి ప్రతిభను వెలికితీయాలి. క్వాంటం ఎకానమీని నిర్మించడంలో కీలక తోడ్పాటుదారునిగా ఇండియా మారుతుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వందల వేల మంది యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులకు అధిక-నాణ్యత కలిగిన క్వాంటం కంప్యూటింగ్ విద్యను ప్రయోగాత్మకంగా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీ పరిశ్రమలో తమిళనాడును అగ్రగామిగా గుర్తించింది.

నాన్ ముధల్వన్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన ఉద్యోగ నైపుణ్యాలను అందుబాటులోకి తెచ్చింది. TNSDC క్వాంటం విద్యకు విస్తృత అవకాశాలను నిర్ధారించడంలో తమిళనాడును ప్రపంచ మార్గదర్శకంగా తీర్చిదిద్ది, సాంకేతిక విశ్వవిద్యాలయాలకు క్వాంటం కంప్యూటింగ్ విద్యను తప్పనిసరి చేసింది. ఈ చర్య భారతదేశం యొక్క భవిష్యత్తు శ్రామికశక్తి అవసరాలను పరిష్కరిస్తుంది, కీలకమైన జాతీయ ప్రాధాన్యత అయిన క్వాంటమ్‌లో భారతదేశ భవిష్యత్తుకు పునాది వేస్తుంది.

క్వాంటం ఏఐ గ్లోబల్, క్యు – కంట్రోల్ మధ్య కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం క్వాంటం విద్య ప్రజాస్వామ్యీకరణలో గణనీయమైన పురోగతికి వేదికను నిర్దేశిస్తుంది. భారతదేశ జాతీయ క్వాంటం మిషన్‌కు నేరుగా మద్దతు ఇస్తుంది.

క్వాంటం ఏఐ గ్లోబల్ సీఈఓ & వ్యవస్థాపకుడు సంజయ్ చిత్తోర్ మాట్లాడుతూ, “దేశంలో క్వాంటం నైపుణ్యాలు-సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి క్యు – కంట్రోల్ తో భాగస్వామ్యం కావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ వినూత్నమైన ఫౌండేషన్ కార్యక్రమం అమలు చేయడం ద్వారా క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని విద్యార్థులకు పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము, ఈ ప్రయత్నం దేశంలో క్వాంటం-అవగాహన వర్క్ ఫోర్స్‌ను పెంపొందించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి QAIG యొక్క మిషన్‌లో కీలకమైన మైలురాయి. ఈ భాగస్వామ్యంతో మేము భవిష్యత్తును రూపొందిస్తాము, ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం ముందంజలో ఉండేలా చూస్తాము…” అని అన్నారు.

క్యు – కంట్రోల్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అరవింద్ రత్నం మాట్లాడుతూ , “క్వాంటం ఏఐ గ్లోబల్ ఈ కార్యక్రమంకు సరైన భాగస్వామి, మేము సంయుక్తంగా భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ వృద్ధిని ప్రోత్సహించగలమని అని విశ్వసిస్తున్నాము. గ్లోబల్ క్వాంటం టెక్నాలజీలలో నైపుణ్యాన్ని క్వాంటం నైపుణ్య శిక్షణను అందించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను క్వాంటం ఏఐ గుర్తించింది. TNSDC నాన్ ముధల్వన్ పథకానికి సేవలను అందించటం మాకు గౌరవంగా ఉంది, కానీ ఇది ప్రారంభం మాత్రమే- మా భాగస్వామ్యం ద్వారా క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి, స్వీకరణలో భారతదేశం పోటీతత్వ స్థితిని ముందుకు తీసుకెళ్లడం మా విస్తృత లక్ష్యం” అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News